
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఈవెంట్ ఏదైనా సరే అక్కడ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వుండాల్సిందే. అంతలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన చెప్పకుండా పవన్ ఏ ప్రాజెక్ట్ చేయడనే వాదన కూడా వుంది. `వకీల్‌సాబ్` సెట్ కావడానికి కూడా త్రివిక్రమ్ కారణం. ఇటీవల మొదలైన `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో పవన్ నటించడానికి కూడా త్రివిక్రమే కారణం.
ఇంతగా పవన్ ని ప్రభావితం చేస్తున్న త్రివిక్రమ్ `వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించలేదు. కొన్ని కారణాల వల్ల రాలేదని పవన్ సభా ముఖంగా వెల్లడించినా అది కారోనా వల్లే త్రివిక్రమ్ రాలేదని స్పష్టంగా అర్థమైంది. ఇటీవల వరుసగా టాలీవుడ్ స్టార్స్ కోవిడ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. `వకీల్‌సాబ్` చిత్రంలో నటించిన నివేదా థామస్ ఇటీవలే కోవిడ్ బారిన పడ్డానని, విషయం తెలిసిందే వెంటనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లానని వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజ.ఆగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా కోవిడ్ బారిన పడ్డారట. ఈ విషయాన్ని ఆయన వెల్లడించకపోయినా గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ కారణంగా త్రవిక్రమ్ ఆదివారం రాత్రి జరిగిన `వకీల్ సాబ్ `ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాజరు కాలేకపోయారని తెలిసింది.