
కోవిడ్ సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కోవిడ్ బారిన పడుతూనే వున్నారు. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన చాలా మంది సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, పరేష్ రావల్, అలియాభట్, అక్షయ్‌కుమార్.. ఇలా చాలా మంది ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడ్డారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా ఈ సంఖ్య పెరుగుతూనే వుంది.
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నివేదా థామస్, విజయేంద్రప్రసాద్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కోవిడ్ బారిన పడ్డారు. అయితే ఇందులో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కోలుకున్నట్టుగా తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో బయటికి వెల్లడించని త్రివిక్రమ్ డాక్టర్ల సలహాలు తీసుకుంటూ హోమ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు.
తాజాగా ఆయనకు జరిపిన టెస్టుల్లో నెగెటివ్ అని తేలినట్టు తెలిసింది. దీంతో ఆయన కోలుకున్నారని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్ త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ భారీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌ని చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ఆ స్థానంలో మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.