Homeటాప్ స్టోరీస్గురూజీ స్పెషల్ ఫ్యామిలీ సెల్ఫీ

గురూజీ స్పెషల్ ఫ్యామిలీ సెల్ఫీ

గురూజీ స్పెషల్ ఫ్యామిలీ సెల్ఫీ
గురూజీ స్పెషల్ ఫ్యామిలీ సెల్ఫీ

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ తాత్వికుడు, త్రివిక్రమ్ గారు అంటే అందరికీ అభిమానమే. ఆయన కూడా అందరితో కలిసి మెలిసి సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి ప్యాకప్ చెప్పక మాత్రం, ఒక ఋషి లాగా మారిపోతాడు. ఆయన మొదటి నుండి చాలా తక్కువమందితో స్నేహం చేస్తాడని, సర్కిల్ చాలా లిమిటెడ్ గా ఉంటుందని, మొదటినుండి ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళతోనే ఎక్కువగా గడుపుతాడని అందరూ అంటారు.

సినిమా వాళ్ళ పార్టీ కల్చర్ కి భిన్నంగా గురూజీ పుస్తకాలు,సినిమాలు, స్నేహితులే తన ప్రపంచం అన్నట్లు ఉంటారు. తాజాగా త్రివిక్రమ్ గారు తన ఫ్యామిలీ తో కలిసి తనకు బాగా దగ్గరైన కొంతమందికి డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి కూడా అందరు తమ కుటుంబ సభ్యులతో వచ్చారు. ఇక ఈ పార్టీకి టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా హాజరయ్యారు. జానీ మాస్టర్ ఫ్యామిలీ & గురూజీ ఫ్యామిలీ కలిసి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ గారు తన ఫ్యామిలీ మెంబర్స్ తో బయట ఎక్కువగా కనిపించరు. అదేవిధంగా అవార్డు ఫంక్షన్స్ కి కూడా వ్యక్తిగతంగానే వస్తారు. గురూజీ సతీమణి శ్రీమతి సౌజన్య, జాతీయ స్థాయి క్లాసికల్ డ్యాన్సర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All