
ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ చిత్రాల టైటిల్స్‌తో తమిళ హీరోలు వరుసగా హిట్లు సాధిస్తున్న విషమం తెలిసిందే. కార్తి ఖైదీ, దొంగ, విజయ్ `మాస్టర్` ఇలా మెగాస్టార్ టైటిల్స్ ని వాడేస్తున్నారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేరాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సారి టైటిల్ కాదు కథని స్ఫూర్తాగా తీసుకుంటున్నారని తాజా న్యూస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ మూవీ చిత్రీకరణ ఫుల్ స్వింగ్‌లో వుంది.
ఇందులో నటిస్తున్న ఎన్టీఆర్ త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీ తెరపైకి రాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. జూన్ లేదా జూలై నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రానికి చిరంజీవి సూపర్‌హిట్ మూవీ `మంత్రిగారి వియ్యంకుడు` చిత్రంని స్ఫూర్తిగా తీసుకుని ఎన్టీఆర్ చిత్రానికి త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వార్తలపై చిత్ర నిర్మాతలు స్పందించారు. ఈ సినిమాపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవాన్నీ వట్టి గాలివార్తలే నని కొట్టిపారేశారు. దీంతో ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ ఇచ్చినట్టయ్యింది.