
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది ప్రారంభంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో `అల వైకుంఠపురములో` చిత్రంలో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ చిత్రాన్ని చేయబోతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్`కే స్ట్రక్కయిపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. పొలిటిక్ సెటైరికల్ చిత్రంగా ఈ మూవీని చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే
ఎన్టీఆర్ ఇప్పట్లో తనకు డేట్స్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో త్రివిక్రమ్ యంగ్ హీరో రామ్‌తో కలిసి సినిమా చేయబోతున్నరాడంటూ ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` మూవీని పూర్తి చేసేలోగా తను రామ్‌తో మూవీని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ వార్తల్ని త్రివిక్రమ్ కానీ రామ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో తాజాగా మరో వార్త హల్‌చల్ చేస్తోంది. ఇందులో రామ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ని త్రివిక్రమ్ ఎంపిక చేశారని, ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని ఇన్ సైడ్ టాక్. అనుపమ పరమేశ్వరన్ గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన `అఆ` చిత్రంలో నాగవల్లిగా నటించిన విషయం తెలిసిందే. మెయిన్ హీరోయిన్ కాకపోయినా అనుపమ పాత్రకు మంచి పేరొచ్చింది. తాజాగా త్రివిక్రమ్ మరో అవకాశం ఇస్తున్నారని, ఇది మెయిన్ హీరోయిన్ పాత్ర అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రవంతి రవికిషోర్ నిర్మిస్తారట.