Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్మా త్రిష పాప వచ్చేసింది... రాంగీ టీజర్ రిలీజ్

మా త్రిష పాప వచ్చేసింది… రాంగీ టీజర్ రిలీజ్

Trisha RAANGI movie Teaser Released
Trisha RAANGI movie Teaser Released

నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు 7 వ క్లాసులో ఉండగా, వర్షం అని ఒక సినిమా రీలీజ్ అయింది. మా స్కూల్ లో 10 వ తరగతి చదివే పిల్లల బ్యాచ్ దాదాపుగా ఒక 90మంది ఆ సినిమా చూసి వచ్చి, త్రిష ఫోటోలు ఎక్కడ కనపడినా, కట్ చేసుకుని వచ్చి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అతికించుకుని ఆనంద పడే వాళ్ళు, ఆ తర్వాత నేను 10వ క్లాస్ లో చేరాక “అల్లరి బుల్లోడు” మన గడ్డం బాబాయ్ డైరెక్ట్ చేసిన సినిమా చూసా. అప్పుడు నాకు మన త్రిష పాప గ్లామర్ అంటే ఏంటో అర్ధం అయ్యింది.

- Advertisement -

సరే, ఇప్పుడు పాప ఏజ్ బార్ అయ్యి, సినిమాలు తగ్గించుకుంది కానీ, ఇప్పటికీ మన సౌత్ ఇండియాలో యూత్ అని చెప్పుకుని సినిమాలు చేస్తున్న వృద్ధ కపోతాలకు హీరోయిన్ కావాలంటే నయనతార, శ్రియ తర్వాత, మా పాపే కదా దిక్కు. కట్ చేస్తే 2016 లో నాయకి అనే సినిమా చేసిన తరువాత మళ్ళీ త్రిష తెలుగులో కనపడలేదు. అప్పుడంటే మా బాలయ్య బాబుతో “లయన్” చేసిన ఊపులో ఈ ఉప్మా సినిమా ని కూడా ఎక్కించేద్దాం అనుకుంది. కానీ ఇప్పుడు కష్తం కదా.! పెరిగిన టెక్నాలజీ వల్ల, ఇప్పుడు పసి మొగ్గలకు అందాలు కావాలంటే మరీ వెతుక్కుంటూ సినిమాలు చూడవలసిన అవసరం కూడ అల్దెఉ కదా,

విధి అనేది ఎలా ఉంటుంది అంటే, గతంలో త్రిష చేసిన “వినైతాంది వరువాయా” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత మా “చై” బాబుతో సెటిల్ అయిపోయిన సమంత వదిన మళ్ళీ ఇప్పుడు మా పాప చేసిన 96 సినిమా చేసుకుంటోంది. ఇప్పుడు మా పాప ఏమో RAANGI అనే సినిమా చేస్తోంది. గతంలో రాం పోతినేని తో “జస్ట్ గణేష్” అనే కళాఖండం తీసిన మురుగదాస్ అసిస్టెంట్ M.శరవణన్ ఈ సినిమాకు డైరెక్టర్. గతంలో రిలీజ్ అయ్యి, కొంతకాలం పాటు, జనాలను బస్ లు ఎక్కాలంటే భయపడేలా చేసిన జర్నీ సినిమా కూడా మనోడిదే.

ఈ RAANGI సినిమాలో కొంచెం కొత్తగా, ఒక మామూలు అమ్మాయి, గన్ లు పట్టుకున్న మనుషులు, ఒక చిన్న పాప, అనుకోకుండా వచ్చిన స్పామ్ కాల్స్, చివరికి ఒక నార్మల్ అమ్మాయి గన్ డీల్ చేస్తూ, హత్యలు చెయ్యడం, మొత్తం టీజర్ అంతా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో డిజైన్ చెయ్యడం సూపర్ గా ఉంది .

ఏదీ ఏమైనా, ఈ సినిమా హిట్ అయ్యి, మళ్ళీ మా పాప ఫామ్ లోకి వచ్చి, మా బాలయ్య బాబుతో ఇంకో సినిమా చేస్తే చాలు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts