Homeగాసిప్స్క్రేజీ హీరోయిన్ యాక్ష‌న్ మంత్రం ఫ‌లిస్తుందా?

క్రేజీ హీరోయిన్ యాక్ష‌న్ మంత్రం ఫ‌లిస్తుందా?

క్రేజీ హీరోయిన్ యాక్ష‌న్ మంత్రం ఫ‌లిస్తుందా?
క్రేజీ హీరోయిన్ యాక్ష‌న్ మంత్రం ఫ‌లిస్తుందా?

తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీ క‌థానాయ‌కిగా పేరు తెచ్చుకుంది త్రిష‌. రెండు భాష‌ల్లోనూ క‌థానాయిక‌గా స్టార్‌డ‌మ్‌ని ఎంజాయ్ చేసిన త్రిష గ‌త కొంత కాలంగా త‌న పూర్వ వైభ‌వం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించి క‌థానాయిక‌గా మంచి గుర్తింపుని క్రేజ్‌ని సొంతం చేసుకున్న త్రిష త‌న పంథాకు భిన్నంగా హార‌ర్ చిత్రాల్లోనూ న‌టించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఒక ద‌శ‌లో వ‌రుస మూస చిత్రాల్లో న‌టించ‌డంతో త‌న ఫామ్‌ను కోల్పోయిన ఆమె ఇటీవ‌ల న‌టించిన త‌మిళ చిత్రం `96` మంచి విజ‌యాన్ని సాధించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకుంది. న‌టిగా త్రిష‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

తాజాగా త‌న పంథాకు భిన్నంగా త్రిష యాక్ష‌న్ థ్రిల్ల‌ర్స్ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఆమె న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `రాంగి`. `జ‌ర్నీ` ఫేమ్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై `2.ఓ` ఫేమ్ అల్లిరాజా సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఏ.ఆర్‌. మురుగ‌దాస్ క‌థ అందించిన ఈ చిత్ర టీజ‌ర్‌ని చిత్ర బృందం ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఇందులో మునుపెన్న‌డు చూడ‌ని విధంగా త్రిష యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించి అబ్బుర‌ప‌రిచింది. కెరీర్ తొలి నాళ్ల‌లో గ్లామ‌ర్ తార‌గా ఆక‌ట్టుకుని స్టార్ క‌థానాయిక‌గా పేరుతెచ్చుకున్న త్రిష యాక్ష‌న్ స్టార్‌గా ఏ స్థాయిలో ఆక‌ట్టుకోనుంద‌న్న‌ది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -

గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్న త్రిష యాక్ష‌న్ మంత్రం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న`రాంగి` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత అల్లిరాజా సుభాస్క‌ర‌న్ ప్లాన్ చేస్తున్నారు. త్రిష న‌ట‌న‌, ఎ.ఆర్. మురుగ‌దాస్ అందించిన క‌థ‌పై వున్న న‌మ్మ‌కంతో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని ఏ డిస్ట్రిబ్యూట‌ర్‌కు ఇవ్వ‌కుండా స్వ‌యంగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All