Homeటాప్ స్టోరీస్ఎంతైనా 'త్రిష' ఉంటేనే వేరబ్బా సినిమాలో...

ఎంతైనా ‘త్రిష’ ఉంటేనే వేరబ్బా సినిమాలో…

ఎంతైనా 'త్రిష' ఉంటేనే వేరబ్బా సినిమాలో
ఎంతైనా ‘త్రిష’ ఉంటేనే వేరబ్బా సినిమాలో

మొదట తమిళ పరిశ్రమలో సినిమాలు చేసుకుంటూ బాగా పేరు తెచ్చుకున్న ‘త్రిష’ తెలుగులో మొదటి సినిమాగా యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్‘ సరసన ‘వర్షం’ సినిమా ద్వారా  పరిచయం అయ్యారు. త్రిష నటనకి మొదటి సినిమాకే ‘ఫిలిం ఫేర్ అవార్డు’ దక్కింది. నటన పరంగా అందరినుండి మంచి మార్కులు వేసుకున్న త్రిష తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో అభిమానులని సొంతం చేసుకుంది.

అప్పటికి తనకి పోటీగా నయనతార, శ్రియా శరన్, అనుష్క శెట్టి, ప్రియమణి లాంటి వారు అందం, అభినయం ప్రదర్శించించి హాట్ హీరోయిన్స్ గా వారి అభిమనులకి దగ్గర అవుతుంటే త్రిష మాత్రం అందుకు విభిన్న౦గా ఉంటూ, వచ్చిన అవకాశాలని చేసుకుంటూ వెళ్తుంది. బాలీవుడ్ లో మాత్రం త్రిష కోరిక నెరవేరలేకపోయింది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు అన్ని బోల్తా కొట్టాయి. నాగ చైతన్య – సమంత కలిసి మొదటి సారి నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాని తమిళంలో సమంత చేసిన పాత్ర చేసింది త్రిష. దర్శకులు కూడా ఒకలే రెండు సినిమాలకి.

- Advertisement -

గత సంవత్సరం త్రిష తమిళంలో ’96’ సినిమాని చేసింది. ఆ సినిమా తమిళంలో బాగా విజయం సాధించింది. అందుకే ఆ సినిమాని దిల్ రాజు గారు నిర్మాతగా తెలుగు రీమేక్ రైట్స్ ని కొనేసారు. కట్ చేస్తే అక్కడ త్రిష చేసిన పాత్రని ఇప్పుడు తెలుగులో సమంత గారు చేస్తున్నారు. 9 సంవత్సరాల క్రితం తెలుగులో సమంత చేసిన పాత్రలో తమిళంలో  త్రిష చేసింది. ఇప్పుడు తమిళంలో త్రిష చేసిన పాత్రలో తెలుగులో సమంత చేస్తుంది. ఇకపోతే త్రిషకి మళ్ళీ తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆమె 2016 లో తెలుగులో ‘నాయకి’ సినిమా చేసింది. ఆ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాపు అయ్యింది. అందువలన తెలుగులో మళ్ళీ సినిమాలు చేయలేదు. తెలుగు నిర్మాతలు కూడా త్రిషకి మళ్ళీ అవకాశాలు ఇవ్వలేదు.

చిరంజీవి-కొరటాల శివ కలయికలో వస్తున్న సినిమాలో మొదట త్రిష పేరే వినిపిస్తుంది. అప్పటికి త్రిష, చిరంజీవి గారు ‘స్టాలిన్’ సినిమాలో కలిసి నటించారు. క్లాసిక్ మూవీస్ కి పెట్టిన పేరు ‘మణిరత్నం’ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా త్రిష గారి పేరు వినిపిస్తుంది. ఆ సినిమా తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి విడుదల చేస్తారు. ‘పొన్నియిన్ సెల్వం’ పేరుతో మణిరత్నం గారు ఒక పీరియాడిక్ సినిమాని చేస్తున్నారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాలో  “విక్రమ్,  కీర్తి సురేష్, జయం రవి, కార్తీ, మోహన్ బాబు, పార్తిబన్, ఐశ్వర్య రాయి, అమలా పాల్, జ్యోతిక” లాంటి వారు పెద్ద తారాగణం నటిస్తుంది.

ఇక వారితో త్రిష కూడా కలిస్తే సినిమాకి త్రిష వలన సినిమాకి బలం అవుతుంది. ఎందుకంటే అంతమందితో కలిసి నటించడం అంటే త్రిష కి మంచి బూస్ట్ అప్ దొరికినట్టే. ఒకవేళ నిజంగానే త్రిష గారు కనుక ఈ సినిమా చేస్తే ఆమెకి మరింత అభిమానులు పెరిగే అవకాశం లేకపోలేదు. రచయిత ‘కల్కి కృష్ణ మూర్తి’ రాసిన చోళుల చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం గారు పొన్నియిన్ సెల్వం సినిమాకి తగిన విధంగా పలు మార్పులు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న త్రిష అభిమానులు ఎంతైనా ఇలాంటి పాత్రలో త్రిష గారు నటిస్తే చూడడానికి రెండు కళ్లు చాలవు అని అనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All