
క్రేజీ హీరోయిన్ త్రిష పెళ్లి వార్తలు మళ్లీ మొదలయ్యాయి. కొన్నేళ్ల క్రితం త్రిష తమిళ హీరో శింబు గాఢంగా ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నారని వార్తలు షికారు చేశాయి. అయితే ఆ వెంటనే ఇద్దరి మధ్య ఏమీ లేదని ప్రచారం ఊపందుకుంది. ఆ మధ్య యంగ్ తమిళ్ ప్రొడ్యూసర్‌ని త్రిష వివాహం చేసుకోవాలనుకుంది.
ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ ఇంతలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి త్రిషపై పెళ్లి రూమర్‌లు రావడం ఆగిపోయింది. ఆ తరువాత టాలీవుడ్ హీరో రానాతో త్రిష సన్నిహితంగా వుంటోదని వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదని తేలడం, సోషల్ మీడియా ఇన్ స్టాలో వున్న ఫొటోల్ని త్రిష తొలగించడంతో ఆమె పెళ్లి కి సంబంధించిన వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.
తాజాగా మరోసారి ఆమె శింబుతో ప్రేమలో పడిందని, ఇద్దరూ కలిసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు షికారు చేయడం మొదలైంది. ఇటీవల శింబు ఫాదర్ రాజేందర్‌ని మీడియా ఈ విషయమై ప్రశ్నిస్తే ఆయన సమాఆనం దాటవేయడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని తమిళ మీడియాలో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. దీని గురించి మరి శింబు ఏమంగాడో చూడాలి.