Wednesday, August 17, 2022
Homeటాప్ స్టోరీస్షూటింగ్ లకు అనుమతి లభించినా కష్టమే

షూటింగ్ లకు అనుమతి లభించినా కష్టమే

షూటింగ్ లకు అనుమతి లభించినా కష్టమే
షూటింగ్ లకు అనుమతి లభించినా కష్టమే

కరోనా మహమ్మారి ఇంకా దేశాన్ని పట్టిపీడిస్తోంది. పాజిటివ్ కేసుల్లో మనం చైనాను కూడా దాటేశాం. అయితే దాదాపు రెండు నెలల నుండి ఉన్న లాక్ డౌన్ కు క్రమ పద్దతిలో సడలింపులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే షూటింగ్ లకు కూడా అనుమతి లభించే అవకాశం ఉందన్నది టాక్. ఈ వార్తకు సినిమా వాళ్ళు మొత్తం హ్యాపీ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రెండు నెలలకు పైగా షూటింగ్ లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వందల కోట్లలో నష్టాలూ వచ్చాయి.

- Advertisement -

అయితే షూటింగ్ లకు అనుమతులు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే నిబంధనలకు లోబడి షూటింగ్ లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాంటి షరతులు ఎలాంటివో తెలియకపోయినా ఇలా ఉండొచ్చు అంటూ కొన్ని షరతులు బయటకు వచ్చాయి. ముందుగా షూటింగ్ మొదలు పెట్టే ముందు ఆ టీమ్ లో అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుందట. తెర వెనుక ఉన్న వారు కచ్చితంగా మాస్క్ ధరించే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. షూటింగ్ లో పాల్గొనే వారి సంఖ్యను కూడా పరిమితం చేయనున్నారు. ప్రతీ రోజూ థర్మల్ టెస్ట్ అందరికీ చేయాల్సి ఉంటుంది.

ఇక ఎవరికైనా సెట్స్ లో ఉండగా పాజిటివ్ అని తేలితే వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా నిర్మాతలకు షూటింగ్ లు సజావుగా జరిగేలా చూడడం అంటే తలకు మించిన భారమే. నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా భయంతో షూటింగ్ కు హాజరు కాము అని చెప్పే అవకాశముంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts