
మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచొస్తున్న టాలీవుడ్ బిగ్గీస్ రిలీజ్ డేట్స్ కంఫార్మ్ అయిపోయాయి. ఈ సంక్రాంతి ఎంతో సంబరంగా ఉండబోతుంది అని ఆశపడ్డ వాళ్లకి బిగ్గెస్ట్ సినిమాలు అన్ని పలు కారణాల వాళ్ళ పోస్టుపోన్ చేయడం చాలా నిరుత్సాహ పరచింది. ఫాన్స్ తో సంబంధం లేకుండా ప్రపంచం అంత ఎదురు చూసే సినిమాలు RRR , రాధే శ్యామ్, పాన్ ఇండియా మూవీస్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలు కోసం చాలానే ఎదురు చూస్తున్నారు ప్రజలు.
అయితే ఇప్పుడు ఆ సినిమాలే కాకుండా అభిమానుల ఎదురుచూపు మేరకు భీమ్లా నాయక్, ఆచార్య, సర్కారు వారి పాట, సినిమాలకు కూడా డేట్లు ఫిక్స్ అయిపోయి. దీంతో అభిమానుల సంతోషాలకు హద్దులే లేవు. ఈ కరోనా బాధ కూడా మార్చ్ కి తగ్గిపోవొచ్చు అన్న అంచనాలు వెలువడుతున్నాయి. టికెట్ రేట్ల సమస్యకి కూడా పరిష్కారం కనిపించేటట్టు ఉందీ..
దాంతో సినిమా పరిశ్రమ మొత్తం పోటాపోటీగా డేట్లను రిలీజ్ చేశారు. ఆలస్యం ఎందుకు మీ అభిమాన సినిమా ఎప్పుడో చూసేద్దాం మరి…
RRR – మార్చ్ 25th
రాధే శ్యామ్ – మార్చ్ 11th
ఆచార్య – ఏప్రిల్ 29th
సర్కారు వారి పాట – మే 12th న రానున్నాయి.
అయితే భీమ్లా నాయక్ మాత్రం ఇంకా కన్ఫ్యూషన్ లో ఉంది. రానా మరియు పవన్ కళ్యాణ్ కాంబో లో రాబోతున్న ఈ సినిమాకు కూడా అంచనాలు పెద్దగానే ఉన్నాయ్. ఇప్పటికీ చాలా సార్లు పోస్టుపోన్ అయ్యింది కూడా. అయినా ఇప్పటికీ కూడా రెండు డేట్ లు కంఫర్మ్ చేశారు feb – 25th గాని ఏప్రిల్ 1st ని గాని అంటూ రెండు డేట్ లు ఇచ్చారు. మరి ఇందులో దేన్నీ కంఫర్మ్ చేస్తారో చూడాలి.f3 కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. ఇది కూడా మొదట ఫిబ్రవరి 25న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ 29న రిలీజ్ అని ప్రకటించారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ వస్తోంది కాబట్టి ‘ఎఫ్ 3’ వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క రోజు ముందుకు జరిగింది. ఏప్రిల్ 28న ‘ఎఫ్ 3’ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.