Homeటాప్ స్టోరీస్త్రివిక్ర‌మ్ కోసం క్యూ క‌ట్టేస్తున్నారుగా!

త్రివిక్ర‌మ్ కోసం క్యూ క‌ట్టేస్తున్నారుగా!

త్రివిక్ర‌మ్ కోసం క్యూ క‌ట్టేస్తున్నారుగా!
త్రివిక్ర‌మ్ కోసం క్యూ క‌ట్టేస్తున్నారుగా!

టాలీవుడ్‌లో వున్నటాప్ స్టార్ డైరెక్ట‌ర్‌ల‌లో భారీ డిమాండ్ వున్న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. మాట‌ల మాంత్రికుడిగా పేరున్న ఆయ‌నతో సినిమా చేయాల‌ని స్టార్ హీరోల‌తో పాటు అప్ క‌మింగ్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు. ఆయ‌న హీరోని తెర‌పై మ‌లిచే తీరు. ప‌లికించే సంభాష‌ణ‌ల‌కు స్టార్ హీరోల్లో ఫ్యాన్స్ కూడా వున్నారంటే అది అతిశ‌యోక్తి కాదు.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నుల్లో వున్నారు. `ఆర్ఆర్ఆర్‌` పూర్త‌యిన వెంట‌నే ఈ మూవీ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసిన త్రి‌విక్ర‌మ్ రాజ‌మౌళి ఎప్పుడు ఫినిష్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేయాల‌ని ఎదురుచూస్తున్నాడు. ఇదిలా వుంటు త్రివిక్ర‌మ్ కోసం మెగాస్టార్ నుంచి అఖిల్ వ‌ర‌కు హీరోలంతా ఎదురుచూస్తున్నార‌ని తెలిసింది.

గ‌త కొంత కాలంగా త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల‌ని మ‌హేష్‌బాబు ఎదురుచూస్తున్నారు. ఆ త‌రువాత రేసులో వున్న హీరో  మెగాస్టార్.. ఈ య‌న కూడా త్రివిక్ర‌మ్ ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఆ త‌రువాత లైన్‌లో వున్న హీరో అఖిల్ అక్కినేని. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ హీరోగా సినిమా చేయాల‌ని నాగార్జున ప‌ట్టుబ‌డుతున్నారు. వీళ్లే కాకుండా బ‌న్నీ కూడా మ‌రోసారి అవ‌కాశం కోసం రెడీగా వున్నార‌ట. మ‌రి ఇంత డిమాండ్ వున్న త్రివిక్ర‌మ్ ముందు ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All