
దసరా సీజన్ ముగిసింది. దీన్నుండి తెలుగు సినిమాలు ఎంతలా క్యాష్ చేసుకున్నాయన్న విషయం పక్కనపెడితే దీని తర్వాత తెలుగు ఇండస్ట్రీ క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ కు ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. మీడియం రేంజ్ హీరోలకు బెస్ట్ సీజన్ గా క్రిస్మస్ సెలవులను పరిగణిస్తున్నారు.
మనకు ఈ సీజన్ లో సెలవులు తక్కువే అయినా యూఎస్ లో క్రిస్మస్ సెలవులు, థాంక్స్ గివింగ్ ఈవెంట్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కారణంగా లాంగ్ వీకెండ్ ఉంటుంది. అందుకే తెలుగు సినిమాలు ఇప్పుడు ఈ సీజన్ ను కూడా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. అయితే ఏకంగా ఆరు సినిమాలు ఈ సీజన్ కు రెడీ అవుతుండడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వెంకీ మామ డిసెంబర్ లోనే విడుదలవుతున్నా అది మొదటి వారంలోనే వచ్చే అవకాశముంది. అయితే రవితేజ ‘డిస్కో రాజా’, సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’, నితిన్ ‘భీష్మ‘ చిత్రాలు క్రిస్మస్ కు వస్తున్నట్లు ప్రకటించాయి. వీటితో పాటు బాలయ్య బాబు, కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కూడా ఈ సీజన్ లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఈ సీజన్ నే టార్గెట్ చేస్తోందిట. ఇన్ని సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి సరే కానీ చివరికి రేసులో మిగిలేవి ఎన్నో చూడాలి.