Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ సెప్టెంబర్ రివ్యూ : డిజాస్టర్లు బోలెడు, హిట్ ఒక్కటే

టాలీవుడ్ సెప్టెంబర్ రివ్యూ : డిజాస్టర్లు బోలెడు, హిట్ ఒక్కటే

టాలీవుడ్ సెప్టెంబర్ రివ్యూ : డిజాస్టర్లు బోలెడు, హిట్ ఒక్కటే
టాలీవుడ్ సెప్టెంబర్ రివ్యూ : డిజాస్టర్లు బోలెడు, హిట్ ఒక్కటే

అసలే హిట్లు తగ్గిపోతున్నాయి అని మనం బాధపడిపోతాం. దీనికి తగ్గట్లే గత నెలలో తెలుగు సినిమా డిజాస్టర్లను చూసింది. విడుదలైన చాలా సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళినవే. చాలా సినిమాలు అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలీదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆగష్టు 30న సాహో విడుదల కావడంతో సెప్టెంబర్ మొదటి వారంలో చెప్పుకోదగ్గ చిత్రాలేం విడుదల కాలేదు. పేరుకి 7 చిన్న చిత్రాలు విడుదలైనా కానీ చెప్పుకోవడానికి ఏం లేదు. జోడి, ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, వీడే సరైనోడు, నీకోసం, తారామణి విడుదలయ్యాయి. ఇవన్నీ డిజాస్టర్స్ అని మళ్ళీ చెప్పకర్లేదుగా.

- Advertisement -

రెండో వారంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ విడుదలైంది. రివ్యూలు ఫర్లేదనిపించాయి, కలెక్షన్స్ కూడా మొదట బాగున్నాయి. కానీ తర్వాత గ్యాంగ్ లీడర్ డల్ అయ్యాడు. మొత్తానికి గ్యాంగ్ లీడర్ యావరేజ్ గా మిగిలింది. గ్యాంగ్ లీడర్ తో పాటు విడుదలైన పహిల్వాన్, మార్షల్ చిత్రాలు వచ్చినవి వచ్చినట్లే వెళ్లాయి.

ఇక మూడో వారంలో గద్దలకొండ గణేష్ విడుదలైంది. పాజిటివ్ రివ్యూలతో ఈ చిత్రం హిట్ అనిపించుకుంది. దాదాపు అన్ని చోట్లా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరుకుంది. అదే రోజు విడుదలైన మరో సినిమా బందోబస్త్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. సైరా అక్టోబర్ 2న విడుదలకు ఉండడంతో సెప్టెంబర్ చివరి వారంలో పేరున్న చిత్రాలేం విడుదల కాలేదు.

నాలుగో వారంలో రాయలసీమ లవ్ స్టోరీ, నిన్ను తలచి, రామ చక్కని సీత వంటి 5 చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అవి కూడా డిజాస్టర్ కు సరికొత్త అర్ధాన్ని చెప్పాయి. ఇలా సెప్టెంబర్ మొత్తం ఎక్కువ నిరాశగా గడిచింది. ఇక అక్టోబర్ లో సైరాతో మంచి ఆరంభం లభించిన నేపథ్యంలో ఈ నెల ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All