Homeటాప్ స్టోరీస్రెడ్డి క్యాస్ట్ తో ప్రేమలో పడుతున్న సినిమావాళ్లు

రెడ్డి క్యాస్ట్ తో ప్రేమలో పడుతున్న సినిమావాళ్లు

tollywood love with reddy communityరెడ్డి క్యాస్ట్ అమ్మాయిలతో , అబ్బాయిలతో ప్రేమలో పడుతున్నారు పలువురు సినీ వారసులు . అది కూడా ఆర్ధికంగా బాగా బలంగా ఉన్నవాళ్ళతో ప్రేమలో పడుతూ ఆ ప్రేమని సఫలం అయ్యేలా చేసుకుంటున్నారు కాకపోతే ఒకటి అరా ! అక్కడక్కడా విఫలం అవుతున్నాయి ఒక్క అఖిల్ విషయంలో తప్ప. రెడ్డి కమ్యూనిటీ కి చెందిన అమ్మాయిలను అల్లు అర్జున్ , చరణ్ లతో పాటుగా మంచు సోదరులు విష్ణు , మనోజ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోగా చరణ్ ఉపాసన రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు , అలాగే మంచు విష్ణు వెరోనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు …… మంచు మనోజ్ ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే అఖిల్ కు మాత్రం రెడ్డి అమ్మాయి కలిసి రాలేదు . శ్రియా భూపాల్ రెడ్డిని ప్రేమించాడు ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది కానీ పెళ్లి దగ్గరకొచ్చేసరికి తేడాలు వచ్చాయి దాంతో ఆ సంబంధం కట్ అయిపొయింది .

ఇక ఇప్పుడేమో రెడ్డి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది అగ్ర హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత . కూతురు ప్రేమ వ్యవహారం వెంకటేష్ కు తెలియడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట ! ఇక ఇరు కుటుంబాలు కూచొని మాట్లాడుకుంటే , ముహూర్తం చూస్కుంటే పెళ్లి భాజాలు మోగడం ఖాయం . మొత్తానికి రెడ్డి వర్గంతో కమ్మ , కాపు వర్గాలకు చెందిన సినిమావాళ్లు మమేకం అవుతున్నారు . అందునా బాగా డబ్బున్న వాళ్లతోనే ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి మరి .

- Advertisement -

English Title: tollywood love with reddy community

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All