Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ బయోపిక్స్ వర్సెస్ ఫ్యాక్షన్ స్టోరీస్

టాలీవుడ్ బయోపిక్స్ వర్సెస్ ఫ్యాక్షన్ స్టోరీస్

tollywood biopics vs faction storiesటాలీవుడ్ లో బయోపిక్ ల జోరు మొదలయ్యింది , ఈ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్ లో ఉంది పైగా దాని సక్సెస్ రేటు కూడా ఎక్కువే కావడంతో ……. ఆ సక్సెస్ లు ఇస్తున్న కిక్ ఎక్కువగా ఉండటంతో బయోపిక్ లు అక్కడ ఎక్కువగా వస్తున్నాయి . ఇక ఆ జోరు తాజాగా టాలీవుడ్ లో కూడా మొదలయ్యింది . మహానటి సావిత్రి బయోపిక్ మహానటి సంచలన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా లభించడంతో ఆ చిత్రాల జోరు ఎక్కువయ్యింది తెలుగులో . ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ,వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ , కత్తి కాంతారావు లతో పాటుగా పలు బయోపిక్ లు క్యూ కడుతున్నాయి .

ఇక 90 వ దశకం చివర్లో రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాలు సరికొత్త ట్రెండ్ ని సృష్టించాయి తెలుగునాట . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన పలు చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి కట్ చేస్తే ఆ మూసలో చాలా చిత్రాలు రావడంతో కొన్నాళ్ల పాటు ఆ చిత్రాల జోరు తగ్గింది . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాల హవా మొదలయ్యింది . ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ లు రాయలసీమ నేపథ్యంలో సినిమాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఆల్రెడీ సినిమా షూటింగ్ జరుగుతోంది దసరా కానుకగా అరవింద సమెత వీర రాఘవ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కనుంది . ఈ సినిమా జూన్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . ఒకవైపు బయోపిక్స్ – మరోవైపు రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలతో ఈ ఏడాది మహా రంజుగా సాగనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All