
చిత్రసీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన హయత్ నగర్ లో చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనికి చెందిన మరిగంటి కార్తీక్ కుమార్ చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 14 వ తేదీన కార్తీక్ కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు.
కార్తీక్ తన బైక్‌పై బయటకు వెళ్లినట్లు .. చివరిగా తన సోదరుడు సందీప్ తో ఫోన్ లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారు. ఆ తర్వాత 16 వ తేదీన జీవీఆర్ క్రికెట్ అకాడమీ వద్ద ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు సమాచారం ఇవ్వగా .. 17 వ తేదీన కార్తీక్ కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించగా.. అది తమ కార్తీక్ దే అని గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది