
తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఈ రెండిటికీ ముడిపెడుతూ రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. వీటికి కేంద్ర బిందువు రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఒక ఏపీ మంత్రిని ఉద్దేశించి సన్నాసి అని సంబోధించడం, నా సినిమాలు ఆపేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకండి అని చెప్పడం జరిగాయి. దీనిపై ఏపీ మంత్రి కూడా అంతే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
ఇదిలా జరిగితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అనంతరం అవి వ్యక్తిగతంగా జరిగినవే తప్ప తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని నిర్మాతల మండలి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది జరిగి రెండు రోజులైనా కాకుండా మంత్రి పేర్ని నానిని టాలీవుడ్ నిర్మాతలు మచిలీపట్టణంలో కలిశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీ సమస్యలను రాజకీయం చేయవద్దని అన్నారు. దీంతో టాలీవుడ్ లో పవన్ ఒంటరి అయ్యాడా అనే వ్యాఖ్యలు పెరిగాయి.
ఆ వ్యాఖ్యలు ఇంకా ముదరకముందే టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, మైత్రి నవీన్, వంశీ రెడ్డి, బన్నీ వాసు, డివివి దానయ్య, సునీల్ నారంగ్ తదితరులు పవన్ కళ్యాణ్ ను అమరావతిలో కలిశారు. చిత్ర పరిశ్రమ సమస్యల గురించి మంచి వాతావరణంలో చర్చలు జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు.
Tollywood Top Producers Today met PowerStar Janasena Chief #PawanKalyan pic.twitter.com/d1rJxCKOKT
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2021