
దిల్‌రాజు ఏ మూహూర్తాని పెళ్లి చేసుకున్నారో కానీ అప్పటి నుంచి టాలీవుడ్‌లో వరుస పెళ్లి బాజాలు మోగుతూనే వున్నాయి. రానా, నిఖిల్, నితిన్ వంటి క్రేజీ హీరోలు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుని బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పేశారు. ఆ తరువాత మెగాడాటర్ కొణిదెల నిహారికా, తాజాగా కాజల్ పెళ్లికి రెడీ అయిపోతున్నారు. నిహారికా ఇటీవల తన బ్యాచిలర్ పార్టీని గోవాలో ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వివాహ ఏర్పాట్లతో బిజీగా ఉండగా కాజల్ అగర్వాల్ తన వివాహ ఏర్పాట్లు.. వివాహానికి ముందు ఉత్సవాలకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కాజల్ పెళ్లి ఈ నెల 30న జరగబోతోంది. బుధవారం మెహెందీ ఫంక్షన్ జరిగింది. గురువారం సంగీత్ కి కాజల్ ఫ్యామిలీ అంతా రెడీ అయిపోతోంది.
ఈ సందర్‌భంగా మెహెందీ ఫంక్షన్‌కి సంబంధించిన ఫొటోల్ని కాజల్ తాజాగా అబిమానులతో పంచుకుంది. తన చేతుల్లో అందమైన మెహెందీతో సంతోషంగా ఉన్న భంగిమలో తన చిత్రాన్ని పోస్ట్ చేసింది. కాజల్ అగర్వాల్ సంతోషంగా నవ్వుతూ అందంగా కనిపించింది. కాజల్ కొద్ది రోజుల క్రితం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 న ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకోబోతున్నారు.