Homeటాప్ స్టోరీస్వంద శాతం ఆక్యుపెన్సీకి టీఎన్ గౌట్ గ్రీన్‌సిగ్న‌ల్‌!

వంద శాతం ఆక్యుపెన్సీకి టీఎన్ గౌట్ గ్రీన్‌సిగ్న‌ల్‌!

వంద శాతం ఆక్యుపెన్సీకి టీఎన్ గౌట్ గ్రీన్‌సిగ్న‌ల్‌!
వంద శాతం ఆక్యుపెన్సీకి టీఎన్ గౌట్ గ్రీన్‌సిగ్న‌ల్‌!

న‌వంబ‌ర్ 10 నుంచి థియేట‌ర్లు రీఓపెన్ అయిన విష‌యం తెలిసిందే. థియేట‌ర్ల‌ని కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో రీఓపెన్ చేసుకోవ‌చ్చు అంటూ కేంద్రం రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతోకొంత మేర థియేట‌ర్ల‌ని రీఓపెన్ చేశారు. అయితే దీని వ‌ల్ల థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయని, తెరిస్తే థియేటర్లని 100 శాతం ఆక్యుపెన్సీతో రీఓన్ చేయాలిన అందుకు ప్ర‌భుత్వాలు అంగీక‌రించాల‌ని గ‌త కొన్ని రోజులుగా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ని ర‌న్ చేసుకోవ‌చ్చు అంటూ తమిళనాడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 50 శాతం ఆక్యుపెన్సీ కార‌ణంగా న‌ష్టాలు చ‌విచూస్తున్నామ‌ని, ఈ విధానం వ‌ల్ల కొత్త సినిమాలు విడుద‌ల ఇబ్బంది క‌రంగా మారింద‌ని త‌మిళ‌నాడు థియేటర్స్ యాజమాన్యం ఇటీవల టిఎన్ ప్రభుత్వాన్ని కలుసుకుని సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలంటూ తమ అభ్యర్థనను ప్రభుత్వం ముందు పెట్టింది.

- Advertisement -

వెంట‌నే ప్రభుత్వం ఆరోగ్య శాఖను సంప్రదించి కోవిడ్ ప‌రిస్థితుల‌పై ఓ నివేదిక‌ని తెప్పించింది. దీని ఆధారంగానే థియేట‌ర్ల‌ని 100 శాతం పెంచుకోవ‌చ్చు అంటూ తాజాగా ఉత్త‌ర్వుల‌ని జారీ చేసింది. తాజా  నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ ల‌లో 100 శాతం ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల్ని పాటిస్తూనే 100 శాంతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ని ర‌న్ చేయ‌బోతున్నార‌ట‌. కోరిన‌ట్టుగానే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సీటింగ్ కెపాసిటీని పెంచ‌డంతో డిస్ట్రీబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు నిర్మాత‌లు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో టాలీవుడ్ పెద్ద‌లు కూడా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ త‌మిళ‌నాడు త‌ర‌హా అనుమ‌తులు ల‌భించాల‌ని కోరుకుంటున్నారు. మ‌రి ఆ దిశ‌గా ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాయో లేదో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All