Homeటాప్ స్టోరీస్టిక్ టాక్ చేస్తే రూ. 18 లక్షలు

టిక్ టాక్ చేస్తే రూ. 18 లక్షలు

Tik Tok Star Holly Horne Earns Croes
Tik Tok Star Holly Horne Earns Croes

టెక్నాలజీ మనుషులకి మంచి ఏం చేసిందో తెలియదు గానీ, విచక్షణ అనేది తెలియకుండా వెర్రి పుష్పాలను చేసి ఆడుకుంటోంది.! అనేది ఒక చేదు నిజం. అలాంటిది అరచేతిలో టెక్నాలజీ ఒక సెల్ ఫోన్ రూపంలో వచ్చాక ప్రతివాడు ఆస్కార్ స్థాయి నటన కనబరిచే కళాకారులు అయిపోతున్నారు.

ఇంతకీ నా బాధ ఏమిటంటే ఈ మధ్య టిక్ టాక్ అనే ఒక దిక్కుమాలిన అప్లికేషన్ వచ్చింది. దీనమ్మ జీవితం..! ఒక చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నామో.? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో.? ఏం చేస్తున్నామో.? అనే స్పృహ కూడా లేకుండా ఎప్పటికప్పుడు టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. ఇది క్రమేపీ ఒక వ్యసనంగా మారి తర్వాత ఒక మానసిక రుగ్మతగా కూడా తయారైంది. ఇది ఎంత నీచానికి దిగజారి పోయింది అంటే,… ఎవడో పొరపాటున కూర్చుని ఏడుస్తున్నాడు కదా.. అని దగ్గరకు వెళ్లి చూసి అయ్యో ఏమైంది.? అని అడుగుతుంటే.. ఏమీ లేదండీ.! టిక్ టాక్ వీడియో చేస్తున్నామని అంటున్నారు.

- Advertisement -

కానీ కొంతమంది ఈ టిక్ టాక్ వీడియోలు మీద కోట్లు సంపాదిస్తున్నారు. నేను మనం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పలికే ఉప్పల్ బాలు గురించి మాట్లాడటం లేదు. లండన్ లో “హాలీ హార్న్” అని ఒక అమ్మాయి ఉంది. వయసు కేవలం 23 కానీ ఆమె ప్రస్తుతం ఏదైనా ఒక సినిమా కి గానీ, ఏదైనా ఒక ఎపిసోడ్ తీసుకునే పారితోషికం అక్షరాలా 18 లక్షలు. టిక్ టాక్ వీడియోల మీద పాపులర్ అయి 1.6 కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆమె. ఆమె బయటికి వెళుతుంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నట్టు చుట్టూ సెక్యూరిటీగా బాడీగార్డులు కూడా ఉంటున్నారు. గత ఏడాది ఆమె టిక్ టాక్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో ఏకంగా 7.7 కోట్ల views సంపాదించడంతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయింది ఈ లండన్ పిల్ల. ఇంకేంటి ఊరికే డబ్బులు వచ్చి పడుతుండటంతో ఉన్న ఉద్యోగం కూడా మానేసి షూటింగ్ ఉన్నప్పుడు సినిమాలు చేసుకుంటూ; ఖాళీగా ఉన్నప్పుడు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ బతుకుతుంది.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో ఆమెకు ఉన్న అభిమానుల్లో 80 శాతం మంది అమ్మాయిలే నంట. మిగతా 20 శాతం మాత్రమే అబ్బాయిలు. ఈ వార్త గనక జనాల్లో ఈ బాగా వెళ్ళింది అంటే ఇక ఇప్పటివరకు బట్టల షాపులో డిస్కౌంట్లు కోసం పోట్లాడే మన లేడీస్.. ఇక టిక్ టాక్ వాడి మీద కూడా డబ్బుల కోసం పోట్లాట పెట్టుకోవడం గ్యారంటీ.

అసలు ఏమిటో ప్రపంచం. రోజురోజుకు ఎటు పోతుందో అర్థం కావట్లేదు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All