Homeటాప్ స్టోరీస్టైగర్ అరాచకం – బాఘీ 3 ట్రైలర్

టైగర్ అరాచకం – బాఘీ 3 ట్రైలర్

Tiger Shroff Baaghi 3 trailer
Tiger Shroff Baaghi 3 trailer

అన్న అమాయకుడు ; తమ్ముడు పెద్ద తోపు. అన్నయ అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్. తమ్ముడు అన్నకు హెల్ప్ చేస్తూ, డిపార్ట్మెంట్ & పబ్లిక్ దృష్టిలో “అన్న” ను హైలెట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడో విన్నట్టు ఉంది చిన్నా…! అని ఆలోచిస్తే… తమిళంలో ఎప్పుడో వచ్చి హిట్ అయిన సినిమా “వెట్టయి”. ఈ సినిమాను తెలుగులో నాగచైతన్య & సునీల్ కాంబినేషన్ లో “తడాఖా” గా తీసారు, మన రీమేక్ సినిమాలకు పెట్టింది పేరైన కిషోర్ కుమార్ పార్ధసాని అలియాస్ డాలీ సర్. సరే, ఆ సినిమాల కథ కంటే “మారా ఓ మారా”… అంటూ తమన్నా డామినేషన్ ఎక్కువైంది.

ప్రస్తుతం అలంటి అన్న & తమ్ముడు బ్యాక్ డ్రాప్ కథతో బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ & రితేష్ దేశ్ ముఖ్ నటిస్తున్న సినిమా బాఘీ 3. అహ్మద్ ఖాన్ దర్హకుడు. సాజిద్ నాదియాడ్ వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ నిండా టైగర్ యాక్షన్ సీన్స్ తో నింపేసారు. ఒక సూపర్ హీరోకు ఎ మాత్రం తగ్గని విధంగా, ఇంటర్నేషనల్ స్థాయి యాక్షన్ స్టంట్స్ చేస్తున్నారు టైగర్. ఇక ఈ సినిమాలో కథ ప్రకారం, అన్న ఒక అమాయకుడైన పోలీస్ అధికారి. తమ్ముడు మంచి హీరో మ్యాటర్. అయితే అనుకోకుండా పని మీద సిరియా వెళ్ళిన అన్న అక్కడ టెర్రరిస్టు ల చేతిలో బందీ అయిపోతాడు. ఇక తమ్ముడు బయలుదేరి వెళ్లి, యావత్ దేశం తోనే యుద్ధం చేసే వైనం మనం ఈ సినిమాలో చూడవచ్చు.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All