Homeటాప్ స్టోరీస్బాఘీ 2 ట్రైలర్ అదరగొడుతోంది

బాఘీ 2 ట్రైలర్ అదరగొడుతోంది

tiger shroff baaghi 2 trailer trendingటైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన తాజా చిత్రం ” బాఘీ 2” , కాగా నిన్న ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . ట్రైలర్ పూర్తిగా యాక్షన్ మోడ్ లో ఉండటంతో యాక్షన్ ని కోరుకునే ప్రేక్షకులు ఈ ట్రైలర్ కు బ్రహ్మరధం పడుతున్నారు . తెలుగులో మంచి హిట్ అయిన క్షణం చిత్రానికి ఇది రీమేక్ . అయితే తెలుగులో వచ్చిన క్షణం చిత్రంలో పెద్దగా యాక్షన్ సీన్స్ లేవు కానీ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నప్పుడు మాత్రం పూర్తిగా మార్చేశారు .

పైగా హీరో టైగర్ ష్రాఫ్ కావడంతో యాక్షన్ సన్నివేశాలను దట్టంగా పెట్టారు . తాజాగా విడుదలైన బాఘీ 2 ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది . ఈ చిత్రంలో కూడా బాఘీ హీరోయిన్ , టైగర్ ష్రాఫ్ లవర్ దిశా పటాని నటించింది . బాఘీ సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All