Homeటాప్ స్టోరీస్టైగర్ నాగేశ్వరరావు ప్రీ లుక్ అప్డేట్

టైగర్ నాగేశ్వరరావు ప్రీ లుక్ అప్డేట్

tiger nageswara rao pre look release update
tiger nageswara rao pre look release update

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు నుండి ప్రీ లుక్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం మాస్ మహారాజా జెట్ స్పీడ్ లో ఉన్నాడు. చాలామంది హీరోలు సినిమా సినిమాకు కాస్త గ్యాప్ అయినా తీసుకుంటారు కానీ రవితేజ మాత్రం ఒకేసారి సెట్స్ పైకి రెండేసి , మూడేసి సినిమాలను తీసుకెళ్లి..ప్రతి రోజు షూటింగ్ లతో గడుపుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ మధ్యనే ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రస్తుతం సెట్స్ ఫై ధమాకా , రామారావు చిత్రాలను ఉంచాడు. వీటిలో రామారావు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు ఇలా ఉండగానే మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకరాబోతున్నాడు.

వంశీ దర్శకత్వంలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అనే సినిమా చేయబోతున్నాడు. ఇక చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అప్డేట్ ను తెలియజేసారు చిత్ర యూనిట్. ఏప్రిల్ 2 మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు ప్రీలుక్ రాబోతున్నట్లు తెలిపి అభిమానుల్లో ఆసక్తి నింపారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నాడు. మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర’ చిత్రాల షూటింగ్స్ తో బిజీ గా ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All