Homeటాప్ స్టోరీస్పెద్ద సినిమాలు వస్తే - పెద్దగా టిక్కెట్ బాదుడు

పెద్ద సినిమాలు వస్తే – పెద్దగా టిక్కెట్ బాదుడు

Syeraa
పెద్ద సినిమాలు వస్తే – పెద్దగా టిక్కెట్ బాదుడు

శుక్రవారం వస్తుందంటే సినిమా ప్రియులకు పండుగ, వారం వారం ఎదో ఒక సినిమా రిలీజ్ అవ్వడం, సినిమాల కోసం థియేటర్ కి పరిగెత్తడం, లైన్ లో నిలబడి టిక్కెట్ కోసం పడిగాపులు, చొక్కాలు చింపుకోవడం, టిక్కెట్ కౌంటర్ లో చేతులు పెడితే చెయ్యి తిరిగి టిక్కెట్ తో వచ్చినా, రాకపోయినా సినిమా చూసామా లేదా అన్నది ముఖ్యం! అని ఫ్యాన్స్ దగ్గర నుండి అందరూ ఎదురు చూసే రోజు శుక్రవారం.

మరీ అంత కష్ట పడుకుంటూ, తిన్నా, తినకున్నా, పడుతూ, లేస్తూ డబ్బుల గురించి ఆలోచించకుండా వందలు, వేలు ఖర్చుపెట్టుకుంటూ సినిమాని ఎంజాయ్ చేసే మనం అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంత ఖర్చుపెడుతున్నాం అని కూడా ఆలోచించలేని ధీనస్థితి లో వున్న వాళ్ళకి ఈ వార్త.

- Advertisement -

టిక్కెట్ 50 రూపాయల నుండి 100 చేశారు బాగానే ఉంది, కానీ పెద్ద సినిమాల అప్పుడు ఆ టిక్కెట్ ని 500 చేసినా అడగని మహానుభావులకు ఈ చేదు వార్త. అలా చేసేది సినిమా వాళ్ల్లు కాదు, థియేటర్ వాళ్ల్లు అని కళ్ళు తెరిచి చూడండి.ఈ శుక్రవారం వున్న టిక్కెట్ ధర తరువాతి వారం పెద్ద సినిమా వస్తున్నప్పుడూ ఎందుకు 500 చేస్తున్నారు అని అడగండి, సమాధానం ఇవ్వక పోతే మాట్లాడండి అంటూ ఒక సగటు మనిషి ఆవేదన.

ఆ సగటు మనిషి ఆవేదన అందరికి అర్ధం కాకపోవచ్చు, కానీ ఎవరో ఒక్కరిని అయినా కదిలించక పోతుందా? ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే, ఇంకా కొన్ని రోజుల్లో విడుదల కి సిద్ధంగా ఉన్న సినిమా “సైరా నరసింహా రెడ్డి” గురించి.

సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ “చిరంజీవి” గారు నటిస్తున్న 151 సినిమా. తన కుమారుడు “రామ్ చరణ్” గారు కొణిదెల నిర్మాణంలో చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమా 02 అక్టోబర్ 2019 విడుదల సందర్బంగా థియేటర్ వాళ్లు ఇప్పటినుండి టిక్కెట్ ధరలని పెంచుతున్నారు అని ఒక సగటు మనిషి ఆవేదన.

ఇకనైనా మనం చూస్తున్నది నిజమేనా, ఇలా జరుగుతుందా అని ఆలోచించేవాళ్ల కోసం, మార్పు కోసం ఏం జరుగుతుందో వేచి చూద్దాం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All