Sunday, November 27, 2022
Homeటాప్ స్టోరీస్ఆదరణ దొరకటమే తరువాయి తక్షణమే హీరోలుగా సినిమాలు

ఆదరణ దొరకటమే తరువాయి తక్షణమే హీరోలుగా సినిమాలు

ఆదరణ దొరకటమే తరువాయి తక్షణమే హీరోలుగా సినిమాలు
ఆదరణ దొరకటమే తరువాయి తక్షణమే హీరోలుగా సినిమాలు

ఒకప్పుడు సినిమాలలో ఒక పాత్రకి మనుషులు తక్కువ పడితే జనాలకి ప్రకటనలు ఇచ్చేవారు. ఇంత వయసు కలిగిన వారు ఆడ, మగ కావాలి అని చెప్తారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే ప్రకటనలు చూసి అందులో ఉన్న చిరునామా దగ్గరికి వెళ్ళి సినిమా వారు కొన్ని పరీక్షలు పెడితే, ఆ పరీక్షలో నెగ్గి వారిని వారు రుజువు చేసుకుంటారు, అలా  సినిమాలలో అవకాశాలు కొట్టేస్తారు. మరి ఇప్పుడు అలా ఉందా? అంటే అబ్బే అవేమీ  అవసరం లేదు. యూట్యూబ్ లో కానీ, టిక్ టాక్ లో కానీ మంచి ఆదరణ లబీస్తే ఇంటికి వచ్చి మరి నిర్మాతలు మా సినిమాలలో మీరు హీరోగా చెయ్యాలి అని కొంత డబ్బు ఇచ్చి వెలిపోతున్నారు.

- Advertisement -

బుల్లితెర నుండి సుడిగాలి సుధీర్, గెట్ అప్ శ్రీను, రామ్ ప్రసాద్, మహేష్ ఆచంట వచ్చారు. హీరోలుగా చేసుకుంటున్నారు. ముందు ముందు వచ్చే సినిమాలలో వారు లేనిది సినిమాకి జనాలు రాలేరు అనేంతగా పేరు, ప్రక్యాతలు సంపాదించుకుంటున్నారు. ఇకపోతే ‘తుపాకి రాముడు’ సినిమాతో మన ‘బిత్తిరి స‌త్తి’ కథానాయకుడిగా అడుగుపెడుతున్నాడు. అందరి వంతు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ‘బిత్తిరి సత్తి’ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మీడియా పరంగా బాగా ఫేమస్ అయిపోయిన మన బిత్తిరి సత్తి మొదటి సినిమా ఆడియో విడుదలకి ప్రముఖులని పిలిచి వారి మన్నలను పొందాడు.

తుపాకి రాముడు సినిమా ఆడియో విడుదలకి వచ్చిన ప్రముఖులు తెలంగాణ ఆర్థిక మంత్రి ‘హ‌రీశ్ రావు’, సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ ‘తల‌సాని శ్రీనివాస‌యాద‌వ్’, ఆరోగ్య‌శాఖా మంత్రి ‘ఈటెల రాజేంద‌ర్’ మరియు నిర్మాత ‘దిల్ రాజు’ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖులు ఒకొక్కరిగా మాట్లాడుతూ  బిత్తిరి స‌త్తి ని ఉద్ధేశించి సినిమాకి ముందుగా విజయం చేకూరాలి అని దీవించారు. తుపాకి రాముడు సినిమాకి ‘టి. ప్రభాకర్’ దర్శకులు. బిత్తిరి స‌త్తి, ప్రియ నటి నటులుగా రసమయి ఫిలిమ్స్ పతాకం పై సినిమాని ఎమ్మెల్యే ‘ర‌స‌మ‌యి బాల‌కిష‌న్’ నిర్మించారు. ఆదివారం ఆ వేడుక అట్టహాసంగా జరిగినది. సినిమా విడుదల తేదీని నిర్మాత బాలకిషన్ గారు వేడుకలో చెప్పారు. సినిమాని ఈ నెల 25 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇక అదే రోజు బిత్తిరి సత్తి సినిమాకి పోటీగా తమిళ సినిమా ఒకటి పోటీ పడుతుంది. అదే కార్తీ నటించిన సినిమా ‘ఖైదీ’. ఒకపక్క తమిళ నుండి రెండు సినిమాలు పోటీ పడుతుంటే మద్యలో మన బిత్తిరి సత్తి సినిమా గట్టెక్కుతుందా? అనేది కొంచెం బాదకరంగానే ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం బిత్తిరి సత్తి లాగా కొంతమంది హీరోగా చేసిన సినిమాలు థియేటర్ కి రాగానే మొదటి ఆటకే ఇంటికి వెళ్లిపోయాయి. మరి మన బిత్తిరి సత్తి సినిమా ప్రోమోషన్స్ ని బాగా పాపులర్ చేస్తున్నాడు. యూట్యూబ్ లో, రేడియో సిటీ అంటూ, వార్తల్లో నిలుస్తూ తుపాకి రాముడు సినిమా గురించి అందరు మాటాడుకునేలా చేసుకుంటున్నాడు. మరి మిగియిన వారిలాగా బిత్తిరి సత్తి చేతులు కాల్చుకుంటాడా? లేదా తను అందరికంటే విచిత్రం అనిపించుకుంటాడా? అనేది 25 తేదీన మన అందరికీ తెలిసిపోతుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts