Homeటాప్ స్టోరీస్అన్ని తెలుస్తున్నాయి కానీ ఈ 4:5 లెక్క ఏమిటి గురూజీ...

అన్ని తెలుస్తున్నాయి కానీ ఈ 4:5 లెక్క ఏమిటి గురూజీ…

అన్ని తెలుస్తున్నాయి కానీ ఈ 4:5 లెక్క ఏమిటి గురూజీ...
అన్ని తెలుస్తున్నాయి కానీ ఈ 4:5 లెక్క ఏమిటి గురూజీ…

తెలుగు సినిమాలు అంటే సెంటిమెంట్. సెంటిమెంట్ లేనిది సినిమా లేదు. సినిమాలో ఏదో ఒక సెంటిమెంట్ లేనిదీ ఆ బొమ్మ ఆడినట్లు చరిత్రలో లేదు…ఈ సెంటిమెంట్ ని పాత దర్శకులు, నిర్మాతలు, కథా నాయకులు అందరు అనుసరిస్తారు. ఎందుకంటే దాదాపు వారి సినిమాలు అన్ని అలాంటి సెంటిమెంట్ ని అనుసరిస్తూ వస్తాయి కాబట్టి. ఒకవేళ వారు మర్చిపోయినా సినిమాలో భాగస్వామ్యం అయిన వారు గుర్తు చేస్తూ ఉంటారు.

మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్‘ గారు సినిమా సెంటిమెంట్ లో అనుసరించేది తెలుగు వర్ణమాలలో మొదటి ”అ” అనే అక్షరం అని మనకి తెలుసు. ఎందుకంటే ఎక్కువ ”అ” అనే అక్షరంతోనే సినిమాలు వచ్చాయి అలానే ఘన విజయం సాధించాయి కాబట్టి. 2020 సంక్రాంతి కానుకగా వస్తున్నా ‘అలా వైకుంఠపురములో’ కూడా అదే అక్షరంతో వస్తుంది. ఇది మన అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఇంకొక సెంటిమెంట్ అందరిని తెగ ఇబ్బంది పెడుతుంది. అది ఏంటి అని అందరు దానికోసం తెగ కసరత్తులు చేస్తున్నారు. అది ఒక సమయాన్ని సూచిస్తుంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే ’04:05′ సమయం.

- Advertisement -

అవును అలా వైకుంఠపురములో సినిమా గురించి ఒక్కొక్కటిగా బయటికి రిలీజ్ చేసే పోస్టర్ లో సాయంత్రం ’04:05′ సమయాన్ని సూచుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం అనగా అదే ’04:05′ సమయానికి సినిమాకి సంబంధించిన రెండవ పాట ”రాములో రాములా” అనే పాటని దీపావళి పండగ సందర్బంగా ఈ రోజు కొంత పాటని అలాగే పండగ పర్వదినాన మొత్తం పాటని విడుదల చెయ్యాలి అని నిర్ణయించుకుని నిన్న ఆదివారం కనుక కొత్త సినిమా పోస్టర్ ని విడుదల చేశారు.

ఇక చూసుకుంటే ఇదివరకే సినిమా టైటిల్ విషయంలో ఆంగ్లములో మార్పు జరిగింది అని విన్నాము. అది కూడా గురువు గారి చలవ వలెనే జరిగింది అందుకే ఒక ఆంగ్ల అక్షరం అదనంగా చేర్చబడింది(Ala Vaikuntapuramulo నుండి Ala Vaikuntapurramulo) అని విన్నాము. ఇలా సినిమా విడుదలకి ముందే ఇంత సెంటిమెంట్ ఆలోచిస్తున్న గురూజీ గారు ’04:05′ సమయానికి కూడా ఏదోక రహస్యం దాగి ఉంది? అది ఏంటో? అని తెగ ఆలోచిస్తున్నారు గురూజీ అలాగే “అల్లు అర్జున్” అభిమానులు కూడా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All