Homeటాప్ స్టోరీస్ఈరోజు రిలీజ్ అయిన మూడు సినిమాలు ప్లాప్

ఈరోజు రిలీజ్ అయిన మూడు సినిమాలు ప్లాప్

Three movies gets flop talk ఈరోజు మూడు సినిమాలు విడుదల అయ్యాయి అయితే ఆ మూడు సినిమాలు కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా లేకపోవడంతో డిజాస్టర్ టాక్ వచ్చేసింది . ఈరోజు విడుదలైన సినిమాలలో హెబ్బా పటేల్ నటించిన 24 కిస్సెస్ చిత్రానికి ఓ మాదిరి అంచనాలు ఉండేవి ఎందుకంటే టైటిల్ 24 కిస్సెస్ కాబట్టి పైగా హెబ్బా పటేల్ సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఉండేవి . అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ ప్లాప్ అయ్యింది 24 కిస్సెస్ చిత్రం .

ఇక ఈ సినిమా కాకుండా లవ్ అండ్ వార్ , రంగు చిత్రాలు కూడా విడుదల అయ్యాయి . అయితే రంగు , లవ్ అండ్ వార్ అనే సినిమాలు విడుదలైన విషయం కూడా ఎక్కువమంది ప్రజలకు తెలీదు . ఇక ఈ సినిమాలకు అక్కడక్కడా థియేటర్ లు ఉన్నాయి వాటిల్లో జనాలు లేరు ఉన్న జనాలకు అవి నచ్చలేదు . దాంతో ఈరోజు విడుదలైన మూడు సినిమాలు ప్లాప్ బారిన పడ్డాయి . ఈ మూడు సినిమాలు ప్లాప్ జాబితాలో చేరిపోవడంతో ఈనెల 29 వరకు టాక్సీ వాలా కు తిరుగే లేకుండా పోతోంది .

- Advertisement -

English Title: Three movies gets flop talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All