
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా తర్వాత కొద్దిగా పరిస్థితులు సద్దుమణిగాయి. బాక్స్ ఆఫీస్ కొంచెం కొంచెంగా కోలుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 100 శాతం ఆక్యుపెన్సీ, నాలుగు ఆటలకు అనుమతి ఇవ్వడంతో అక్కడ కూడా కొంత ఆదాయం పెరుగుతుంది. ఇక ఏపీలో టికెట్స్ రేట్స్ సమస్య ఒక్కటి కూడా సెట్ అయిపోతే మళ్ళీ టాలీవుడ్ పూర్తిగా గాడిన పడడం కన్ఫర్మ్.
ఇక ఈ దసరాకు సినిమాల కళ వచ్చేసింది. మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధమైపోయాయి. ముందుగా 14వ తేదీ మహా సముద్రం విడుదలవుతోంది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను అజయ్ భూపతి డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రంపై బజ్ బాగానే ఉంది. మల్టీస్టారర్లు అంటే సాధారణంగా ఆసక్తి ఉండడం సహజం.
ఆ తర్వాతి రోజున అంటే 15న రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అఖిల్ అక్కినేని నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ 15న విడుదల కానుంది. తన మొదటి హిట్ కోసం అఖిల్ ఎదురుచూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ప్రోమోలు అయితే ఆసక్తికరంగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం ద్వారా మొదటి సక్సెస్ ను అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
అలాగే అదే రోజున పెళ్లి సందD థియేటర్లలో సందడి చేయబోతోంది. పాతికేళ్ల క్రితం వచ్చిన ఐకానిక్ హిట్ పెళ్లి సందడి టైటిల్ తో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ఈ చిత్రం వస్తోంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రం మరి ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుందా?.