Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్దిల్‌రాజు @50 బ‌ర్త్‌డేలో ఆ ముగ్గురు లేరే?

దిల్‌రాజు @50 బ‌ర్త్‌డేలో ఆ ముగ్గురు లేరే?

దిల్‌రాజు @50 బ‌ర్త్‌డేలో ఆ ముగ్గురు లేరే?
దిల్‌రాజు @50 బ‌ర్త్‌డేలో ఆ ముగ్గురు లేరే?

ఈ నెల 18న స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న 50వ పుట్టిన రోజు వేడుక‌ల్ని అట్ట‌హాసంగా జ‌రుపుకున్నారు. గురువారం రాత్రి టాలీవుడ్ స్టార్స్‌కి ప్ర‌త్యేకంగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చిరంజీవి నుంచి యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ వ‌ర‌కు అంతా పాల్గొన్నారు. హీరోయిన్‌లు స‌మంత‌, రాశిఖ‌న్నా, నివేదా పేతురాజ్‌, పూజా హెగ్డే కూడా హాజ‌రై చిల్ అయ్యారు. కానీ ముగ్గురు స్టార్స్ మాత్రం ఈ భారీ పార్టీకి హాజ‌రు కాలేక‌పోయారు.

- Advertisement -

ఆ ముగ్గురే నేచుర‌ల్ స్టార్ నాని, `బొమ్మ‌రిల్లు` సిద్ధార్ధ్‌, శ‌ర్వానంద్‌, ఈ ముగ్గురూ దిల్ రాజు నిర్మించిన చిత్రాల్లో న‌టించారు. హిట్‌ల‌నీ సొంతం చేసుకున్నారు. బిగ‌తా స్టార్స్‌తో పోలిస్తే దిల్‌రాజు బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేశారు. ఇతా దిల్ రాజుతో మంచి అనుబంధం వున్న ఈ ముగ్గురు బ‌ర్త్‌డే పార్టీలో క‌నిపించ‌కపోవ‌డానికి కార‌ణం ఏంటీ అని అంతా ఆరాతీస్తున్నారు.

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `ట‌క్ జ‌గ‌దీష్‌` షూట్‌లో బిజీగా వున్నారు. షూట్ కి బ్రేకివ్వ‌డంతో ఫ్యామిలీతో క‌లిసి నాని గోవా వెళ్లారు. అందుకే పార్టీకి రాలేక‌పోయార‌ట‌. ఇక మ‌రో హీరో శ‌ర్వానంద్, హీరో సిద్ధార్ధ్ `మ‌హా స‌ముద్రం` షూటింగ్ కోసం గోవాలో వున్నారు. అందుకే ఈ ఇద్ద‌రూ దిల్‌రాజు పార్టీకి హాజ‌రు కాలేక‌పోయార‌ట‌. శుక్ర‌వారం దిల్‌రాజు ఫ్యామిలీతో స‌హా గోవా వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డే ఈ ముగ్గురూ దిల్ రాజుతో పార్టీ చేసుకున్నార‌ని తెలిసింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts