Homeటాప్ స్టోరీస్ఈ వారం ట్రేడ్ టాక్ పరిస్థితేంటి?

ఈ వారం ట్రేడ్ టాక్ పరిస్థితేంటి?

This week trade talk at box office
This week trade talk at box office

టాలీవుడ్ లో మరో వారం ముగిసింది. కొత్త వారం మొదలైంది. సినిమా లెక్కల ప్రకారం శుక్రవారంతోనే వారం లెక్కలు మొదలవుతాయి. మరి దాన్ని బట్టి ఈ వారం ట్రేడ్ టాక్ ఎలా ఉందో ఒక లుక్కేద్దాం. ముందుగా వెంకీ మామ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా రెండు వారాల రన్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే చాలా సెంటర్లలో చిత్రం సేఫ్ అయ్యేందుకు చాలా కొద్ది దూరంలో నిలిచింది. మరో వారం పాటు థియేటర్లలో నిలిచే ఈ సినిమా మొత్తానికి ఎబోవ్ యావరేజ్ గా మిగలనుంది.

ఇక ప్రతిరోజూ పండగే, టైటిల్ కు తగ్గట్లే అందరికీ పండగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ చిత్రం తొలి వారంలోనే సేఫ్ అవ్వడం విశేషం. ఈరోజు నుండి ఈ చిత్రానికి వచ్చే వసూళ్లన్నీ లాభాల కిందే లెక్క. ఇప్పటికే నైజాం వంటి ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటి కోటికి పైగా వసూళ్లను నమోదు చేసుకుంది. ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలు తీసుకురానుంది.

- Advertisement -

నందమూరి బాలకృష్ణ రూలర్, పై చిత్రానికి పూర్తి భిన్నంగా నడుస్తోంది. ఈ ఏడాది బాలయ్యకు కలిసిరాలేదని రూలర్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ చిత్రం తొలివారంలో కేవలం 7 కోట్ల పైచిలుకు వసూళ్లను నమోదు చేయడం గమనార్హం. ఈ సినిమా బాలయ్య భారీ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

దొంగ సినిమాకు టాక్ బాగానే ఉన్నా విపరీతమైన కాంపిటీషన్ మధ్య వచ్చి నలిగిపోయింది. దబంగ్ 3 పరిస్థితి కూడా ఇంతే.

క్రిస్మస్ కు విడుదలైన మత్తు వదలరా డీసెంట్ టాక్ తెచ్చుకుని క్రమంగా పుంజుకుంటోంది. మొదటి రోజు పెద్దగా వసూళ్లు లేకపోయినా రెండో రోజు నుండి థియేటర్ల సంఖ్య కూడా పెంచుకుని ముందుకెళుతోంది. చాలా పరిమితి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే రోజు విడుదలైన రాజ్ తరుణ్ – దిల్ రాజు చిత్రం ఇద్దరి లోకం ఒకటే చిత్రానికి వచ్చిన టాక్ తో కనీస వసూళ్లు నమోదవ్వట్లేదు. రాజ్ తరుణ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలవనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All