Homeటాప్ స్టోరీస్లిప్‌లాక్ చేయ‌లేదంటున్న విశ్వ‌క్‌సేన్‌!

లిప్‌లాక్ చేయ‌లేదంటున్న విశ్వ‌క్‌సేన్‌!

 

There is no kiss scenes in that two movies Viswak sen
There is no kiss scenes in that two movies Viswak sen

విశ్వ‌క్‌సేన్ త‌ను న‌టించిన రెండు చిత్రాల్లో ఎలాంటి లిప్ లాక్‌లు లేవ‌ని అన్నారు. ప్ర‌స్తుతం `పాగ‌ల్‌` మూవీలో న‌టిస్తున్న విశ్వ‌క్‌సేన్ ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా వున్నారు. అయితే త‌ను న‌టించిన చిత్రాల్లో లిప్‌లాక్‌లు ఎక్కువ‌గా వున్నాయంటూ ఇటీవ‌ల ఓ  నెటిజ‌న్ పోస్ట్ పెట్టాడంటూ ఇన్ స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. `వెళ్లిపోమాకే` , ఈ న‌గ‌రానికి ఏమైంది` చిత్రాల్లో న‌టించాన‌ని, ఈ రెండు చిత్రాల్లో అధ‌ర‌చుంబ‌నాలుంటే నాకు చెప్పండి అంటూ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

అయితే విశ్వ‌క్‌సేన్ న‌టించిన తొలి చిత్రం `వెళ్లిపోమాకే`లో లిప్‌లాక్ సీన్ వుంది. `ఈ న‌గ‌రానికి ఏమైంది` త‌రువాత చేసిన `ఫ‌ల‌క్‌నుమా దాస్`‌, `హిట్` చిత్రాల్లోనూ లిప్‌లాక్ స‌న్నివేశాలున్నాయి. అయితే విశ్వ‌క్‌సేన్ మాత్రం `వెళ్లిపోమాకే`, ఈ న‌గ‌రానికి ఏమైంది` చిత్రాల్లో తాను లిప్‌లాక్ చేయ‌లేద‌ని విశ్వ‌క్‌సేన్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`పాగ‌ల్‌` సెట్‌లోకి విశ్వ‌క్ ఆల‌స్యంగా వ‌స్తాడని, ఫ‌స్ట్ టైమ్ టైమ్‌కి వ‌చ్చాడంటూ ఆ మ‌ధ్య ఓ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోని చేసింది విశ్వ‌క్‌సేనే. కావాల‌నే వైర‌ల్ చేయ‌డం కోస‌మే ఆ వీడియో చేశాన‌ని ఇటీవ‌ల బ‌ర్త్‌డే ‌ఇంట‌ర్వ్యూలో ఆఫ్ ది రికార్డ్ వుల్ల‌డించారు. తాజా లిప్‌లాక్ ల‌పై స్పందించ‌డం కూడా అలాంటి జిమ్మిక్కేన‌ని తెలుస్తోంది. `పాగ‌ల్‌`లోనూ నివేదా పేతురాజ్‌తో విశ్వ‌క్ సేన్ లిప్‌లాక్ వుంద‌ట‌. దాన్ని హైలైట్ చేయ‌డం కోస‌మే విశ్వ‌క్ ఇలా ఆ రెండు చిత్రాల‌ని మాత్ర‌మే ఎక్జాంపుల్‌గా చూపిస్తూ ఆ చిత్రాల్లో లిప్‌లాక్ లేద‌ని ప‌ర్టికుల‌ర్‌గా చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All