Homeటాప్ స్టోరీస్థియేట‌ర్లు తెరుస్తున్నార‌ట‌...!

థియేట‌ర్లు తెరుస్తున్నార‌ట‌…!

థియేట‌ర్లు తెరుస్తున్నార‌ట‌...!
థియేట‌ర్లు తెరుస్తున్నార‌ట‌…!

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే కుసులు 14 ల‌క్ష‌లు దాటాయి. తెలంగాణ లో  దాదాపు 60 వేల‌కు చేరువ‌వుతున్నాయి. ఏపీలో ల‌క్ష దాట బోతున్నాయి. మ‌హారాష్ట్ర‌, చెన్నైల‌లో ఇప్పటికే ప్ర‌మాద స్థాయి దాటి పోయాయి. ఇంత జ‌రుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం లాక్‌డౌన్ అన్ లాక్ ప్ర‌క్రియ‌ను రోజు రోజుకీ స‌డ‌లిస్తూనే వుంది. పేద‌ల‌కు, మ‌ధ్య త‌ర‌గ‌తికి మెరుగైన వైద్యం అందించడంతో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌లం అయ్యాయ‌ని ప్ర‌తిప‌క్షాలు ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇదిలా వుంటే కేంద్రం అన్ లాక్ 3.0 ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్రం సినిమా థియే‌ట‌ర్‌లు ఆగ‌స్టు 1 నుంచి తెరుచుకోవ‌చ్చ‌ని త్వ‌ర‌లో ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే దీనిపై ఓ ప్ర‌తి పాద‌న‌ను కేంద్రం తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్టు తెలిసింది. సోమ‌వారం యూనియ‌న్ మినిస్ట‌ర్ దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.

- Advertisement -

సోష‌ల్ డిస్టెన్స్‌ని పాటిస్తూనే థియేట‌ర్ల‌ని తెరుచుకోవ‌చ్చ‌ని, ఇందుకు అనుగునంగా సీట్ల‌ని మార్చాల్సి వుంటుంద‌ని, ఇందుకు ఇప్ప‌టికే మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ యాజ‌మాన్యం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నిబంద‌న‌ల ప్ర‌కారం ఒక్కో థియేట‌ర్ 25 శాతం టిక్కెట్‌ల‌ని మాత్రమే విక్ర‌యించాల్సి వుంటుంద‌ట‌. అలా అయితే తెరిచినా .. మూసినా ఒక‌టే క‌దా అని ప‌లువురు సినీ జ‌నం వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All