Homeటాప్ స్టోరీస్మొత్తానికి పంతం నెగ్గించుకున్న `క్రాక్‌`!

మొత్తానికి పంతం నెగ్గించుకున్న `క్రాక్‌`!

మొత్తానికి పంతం నెగ్గించుకున్న `క్రాక్‌`!
మొత్తానికి పంతం నెగ్గించుకున్న `క్రాక్‌`!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో స‌ర‌స్వ‌తీ ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి రోజు ఆర్థిక లావాదేవీల కార‌ణంగా విడుద‌ల ఆల‌స్య‌మైన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి 9న ఫ‌స్ట్ షోతో మొద‌లైంది. తొలి షో నుంచే హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ కేవ‌లం ప‌ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది.

ముందు అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రాన్ని నైజాంలో వ‌రంగ‌ల్ శ్రీ‌ను విడుద‌ల చేశాడు. ముందు బాగానే వున్నా ఆ త‌రువాత విజ‌య్ న‌టించిన `మాస్ట‌ర్` రిలీజ్ అయ్యేస‌రికి స‌గానికి స‌గం థీయేట‌ర్లు త‌గ్గించేశారు. దీంతో వ‌రంగ‌ల్ శ్రీ‌ను బాగా న‌డుస్తున్న సినిమాకు కావాల‌నే థియేట‌ర్లు త‌గ్గించార‌ని, త‌మిళ చిత్రం కోసం తెలుగు సినిమా థియేట‌ర్ల‌ని త‌గ్గించి తొక్కేశార‌ని మండిప‌డి మీడియా ముందుకొచ్చారు.

- Advertisement -

`మాస్ట‌ర్‌` ఫ‌లితం తారుమారు కావ‌డంతో `క్రాక్‌` కు థియేట‌ర్లు తిరిగి కేటాయించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ప్ర‌స్తుతం `క్రాక్‌` థియేట‌ర్ల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. వేసిన ప్ర‌తీ థియేట‌ర్ లాభాల్లో ర‌న్న‌వుతుండ‌టంతో ఎగ్జిబిట‌ర్లు ఫ్లాప్ సినిమాల‌ని ప‌క్క‌న పెట్టి `క్రాక్‌` కోసం థియేట‌ర్లు కేటాయించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో `క్రాక్‌` మొత్తానికి పంతం నెగ్గించుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All