ప్రేక్షకులను అబ్బుర పరిచే విన్యాసాలు.. థ్రిల్ చేసే యాక్షన్స్, ఆశ్చర్యానికి గురిచేసే మాయలు.. మంత్రాలు ఇవన్నీ సోషియో ఫాంటసీ చిత్రాల్లో కామన్‌గా ఉండే అంశాలే. ఇలాంటి ఎలిమెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన మ్యాజికల్, అడ్వేంచరస్, ఫ్యామిలీ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన యానిమేటెడ్ ఫిలిమ్ `ది స్టోలెన్ ప్రిన్సెస్`. ఈ ఆగస్ట్ 24న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదలవుతుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ త్రీడీ యానిమేటెడ్ మూవీలో థ్రిల్ చేసే కాన్సెప్ట్ అందులోని సబ్ ప్లాట్స్‌తో పాటు బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ కూడా ఉంది. రస్‌లాన్.. మిలాను ప్రేమిస్తాడు. ఆమె దేశపు యువరాణి అని రస్‌లాన్‌కు తెలియదు. అయితే ఓ కారణంతో యువరాణి మిలాను .. దుష్ట మాంత్రికుడు కోర్‌నోమోర్ కిడ్నాప్ చేస్తాడు. రస్లాన్ తన ప్రేయసిని ఎలా కాపాడుకున్నాడు.. ఈ కాపాడే క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులేంటి? రస్‌లాన్‌కు యువరాణిని కాపాడటానికి ఎవరెవరు సహాయం చేశారు. అనే విషయాలను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతోరూపొందించారు. చెడుపై ఎప్పుడూ మంచే జయిస్తుందనే కాన్సెప్ట్‌తోనే దర్శకుడు ఒలెగ్ మాలముహ్ చిత్రాన్ని తెరకెక్కించారు. యారోస్లావ్ వ్యోతెషేక్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ముఖ్యంగా యానిమేషన్ చిత్రాలను వీక్షించడానికి ఎక్కువ మంది పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. చిన్న పిల్లలకు నచ్చిన యానిమేషన్స్‌ను క్రేజ్ ఉంటుంది. ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు సక్సెస్ అయిన యానిమేషన్ చిత్రాలన్నీ పిల్లలను ఆకట్టుకున్నవే. కాబట్టి పిల్లలను ఆకట్టుకునే ఫీచర్స్‌తో ఈ యానియేషన్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాతలు అలాగే.. అన్ని రకాల ఎమోషన్స్ సమాహారంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించారు.