Homeటాప్ స్టోరీస్ఆస్కార్ బరిలో సత్తా చాటిన “ది ఐరిష్ మ్యాన్”

ఆస్కార్ బరిలో సత్తా చాటిన “ది ఐరిష్ మ్యాన్”

ఆస్కార్ బరిలో సత్తా చాటిన “ది ఐరిష్ మ్యాన్”
ఆస్కార్ బరిలో సత్తా చాటిన “ది ఐరిష్ మ్యాన్”

ప్రకృతిలోకి ఎన్నో జంతువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చివరకు పోలికలు దొరక్క తెలుగు సినిమా వాళ్ళు గొప్పగా హైప్ చేసుకున్న పులులు, సింహాలు ఏనుగులు, గుర్రాలు కూడా పెద్ద ముఖ్యమేమీ కావు. కానీ ఒకే ఒక్క జీవి ఉంటుంది. దాని పేరే డైనోసార్. అది వచ్చిన విషయం, వెళ్ళిన విషయం మాత్రమే రికార్డ్ అవుతుంది. అది చేసి వెళ్ళే అరాచకం గురించి తర్వాత బ్రతికి మిగిలిన ప్రాణులు కథలు,కథలుగా చెప్పుకుంటాయి. ఇప్పుడు ఇంత హైప్ ఇస్తోంది సినిమాకి కాదు, అది తీసిన డైరెక్టర్ కి. ఆ దర్శక డైనోసార్ పేరు మార్టిన్ స్కోర్సేసీ. ఎందుకంటే ఆయన వయసు 75 ఏళ్ళు. సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది.

ప్రపంచంలో ఒక డైరెక్టర్ల బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తారంటే, తీసిన సినిమా అర్ధం కావడానికే ఒక 3 సార్లు చూడాలి. చూసిన మనకే ప్రతిసారి కొత్తగా ఉంటాయ్ వాళ్ళ సినిమాలు. ఇక ఆ సినిమాలలో ఒక్కొక్క దానినుండి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వాళ్ళ ఏకలవ్య శిష్యులు ఒక 10 సినిమాలు తీస్తారు. వాళ్ళలో ఒకానొక పెద్ద మనిషి మార్టిన్ స్కోర్కేసీ. ఇప్పుడు ఆయన డిజిటల్ మీడియాకి “బిగ్ బాస్” బిరుదు సంపాదించిన నెట్ ఫ్లిక్స్ కి ఒక సినిమా తీసి ఇచ్చాడు, దాని పేరు “ది ఐరిష్ మ్యాన్.” ఇక మార్టిన్ సర్ సినిమాలు “టాక్సీ డ్రైవర్” నుండి “వోల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్” ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఫిల్మ్ డిక్షనరీ లా ఉంటుంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ లో 10 నామినేషన్స్ పొందింది. ఇక ఇందాక మనం అనుకున్న డైనోసార్ జాతిలో మరొక వ్యక్తి రాబర్ట్ డి నోరో లాంటి వాళ్ళు నటించారు. ఈ సినిమా మూల కథను స్టీవెన్ జలియన్ అనే రచయిత రాసిన “ఐ హార్డ్ యూ పెయింట్ హౌసెస్” అనే నవల నుండి తీసుకున్నారు.

- Advertisement -

ఈ సినిమా కథ విషయానికి వస్తే, 1960 ల కాలంలో ఫ్రాంక్ షీరన్ అనే ట్రక్ డ్రైవర్ అనుకోకుండా క్రైమ్ వరల్డ్ లో ఇన్వాల్వ్ అవుతాడు. తనకు తెలియకుండానే నేర కార్యాకలాపాల్లో చిక్కుకుంటాడు. డబ్బు కు మొదట్లో ఆశ పడి చివరకు ఆ అండర్ వరల్డ్ డాన్ కి బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అనుకోకుండా ఆ డాన్ చనిపోతాడు. అక్కడినుండి మొదలవుతుంది అసలు రచ్చ. చెప్పడం కంటే నెట్ ఫ్లిక్స్ లో చూస్తే అసలు సిసలు ఒరిజినల్ స్క్రీన్ ప్లే, టేకింగ్, డైరెక్షన్ లో మజా తెలుస్తుంది. ఆస్కార్ అకాడెమీ తోపాటు ప్రపంచవ్యాప్తంగా 302 అవార్డులకు ఈ సినిమా నామినేట్ అయ్యింది. ఇప్పటివరకూ మీరు ది ఐరిష్ మ్యాన్ చూడకపోతే తప్ప్పకుండా చూడండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All