Homeటాప్ స్టోరీస్పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతున్న ఫ్యామిలీ మ్యాన్ 2

పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతున్న ఫ్యామిలీ మ్యాన్ 2

పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతున్న ఫ్యామిలీ మ్యాన్ 2
పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతున్న ఫ్యామిలీ మ్యాన్ 2

వెబ్ సిరీస్ ల హవా మొదలైన కొత్తలో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పటికే దీన్ని కొట్టే వెబ్ సిరీస్ ఇండియాలో రాలేదంటే అతిశయోక్తి కాదు. రాజ్ అండ్ డీకే కలిసి రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్ లో మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్ లో నటించాడు. నిన్ననే ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ విడుదలైంది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్న సెకండ్ సీజన్ కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

మొదటి సీజన్ స్థాయిలోనే సెకండ్ సీజన్ కూడా ఉందని అంటున్నారు. ముఖ్యంగా మనోజ్ బాజ్పాయ్ క్యారెక్టర్ మొదటి సీజన్ తరహాలోనే సెకండ్ సీజన్ లో కూడా ఎఫెక్టివ్ గా డిజైన్ చేసారు. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న సమంత పాత్ర కూడా అంచనాలకు తగ్గట్లే ఉందన్న రివ్యూలు వచ్చాయి.

- Advertisement -

మొత్తానికి చాలా ఎఫెక్టివ్ గా మొదలైన ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ మధ్యలోనే కొంచెం నెమ్మదించినా ఎండింగ్ మాత్రం అదిరిపోయిందట. మూడో సీజన్ ఉంటుందన్న సంకేతాలు కూడా వచ్చాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All