
నెల్లూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. అనంతరం వీటిని జాతికి అంకితమిచ్చారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టి బ్యారేజ్‌ను ప్రారంభించారు. అనంతరం పెన్నా నదికి హారతినిచ్చారు. ఇక సీఎం నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం..
అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు సీఎం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరారు. ఇక పర్యటనలో భాగంగా సీఎం.. బ్యారేజ్‌లను ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఇందులో భాగంగా పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని జగన్ ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం నెల్లూరు వెళ్లి అక్కడ బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇదిలా ఉంటే సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా నదికి వరద ముప్పును నియంత్రించనున్నారు. ఈ బ్యారేజీలో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడం ద్వారా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుతాయని అధికారులు భావిస్తున్నారు.
దీనిద్వారా తాగునీటి, సాగునీటి కష్టాలు తీరుతాయని అంచనా వేస్తున్నారు. గతంలో పెన్నా నది వరద పెరిగితే సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు స్తంభించేవి అయితే ప్రస్తుతం ఈ గ్యారేజీ నిర్మాణంతో ఈ సమస్య తప్పనుంది. ఇక సీఎం తొలుత ఉదయం 9.30గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగం చేరుకున్నారు. అనంతరం అక్కడ 11 నుంచి మధ్యాహ్నం1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించి, బహిరంగసభలో ప్రసంగించారు. ఆ తర్వాత 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.
అనంతరం అక్కడ 1.50 నుంచి 2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇక చివరగా మధ్యాహ్నం 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే… ఈ రోజు ఇది ఒక అద్భుత సంఘటన, సన్నివేశమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేస్తే, ఆయన వారసుడిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆ బ్యారేజ్‌లను ప్రారంభించారు. బ్రిటిష్ పాలనలో నిర్మాణం చేసిన ప్రాజెక్ట్‌లను తిరిగి వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. 2006లో సంగం, 2008లో నెల్లూరు బ్యారేజిను ఆనాడు వైఎస్సార్ శంకు స్థాపన చేశారు. సీఎం జగన్ మూడేళ్లలో శర వేగంగా పాలన అందిస్తున్నారు. సీఎం జగన్ కుటుంబానికి మొదట అండగా నిలిచిన కుటుంబం మేకపాటి కుటుంబం. జలయజ్ఞంలో ప్రారంభమైన పోలవరం, వెలిగొండ ప్రాజెక్ట్‌లు అన్నింటిని కూడా సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తారు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.