Homeటాప్ స్టోరీస్కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

కౌసల్య కృష్ణమూర్తి’ ది క్రికెటర్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

‘కౌసల్య కృష్ణమూర్తి’ ది క్రికెటర్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

- Advertisement -

 

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌‘. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా..

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర టైటిల్‌ రోల్‌ ఐశ్వర్యా రాజేష్‌ పోషించారు. సీనియర్‌ నటుడు అమర్‌నాథ్‌ తనయుడు, కథానాయకుడు రాజేష్‌ కుమార్తె. తమిళ్‌లో ‘కణ’ అనే మూవీ చూసి ఈ సినిమా చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇప్పటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఉంది అని ఈ చిత్రం రైట్స్‌ తీసుకున్నాను. ఈ చిత్రానికి దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ అయితే న్యాయం చేస్తారని ఆయన్ని కాంటాక్ట్‌ అవ్వడం జరిగింది. టైటిల్‌కి తగ్గట్లే ఆ అమ్మాయి టైలర్‌మేడ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ప్రదర్శించింది. తమిళ్‌, మలయాళం భాషల్లో 25 చిత్రాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ ఆమెకి తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. క్రికెట్‌ని బేస్‌తో పాటు కంటెంట్‌ ఉండే స్టోరి. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా దర్శకుడు భీమనేని ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. కార్తీక్‌ రాజు ఈ సినిమాలో హీరోయిన్‌కి లవర్‌గా నటించారు. ఇందులో నాలుగు సాంగ్స్‌ ఉన్నాయి. తమిళ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ధిబు నినన్‌నే ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది. సంగీతంతో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఆడియో, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్‌ను జరుపుకొని జూలై ఫస్ట్‌వీక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఐశ్వర్యా రాజేష్‌ మంచి పెర్‌ఫార్మర్‌ కనుకనే మా బేనర్‌లో రెండో సినిమా చేస్తున్నాం” అన్నారు.

చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”కౌసల్య కృష్ణమూర్తి’ ఓపెనింగ్‌ అప్పుడు ఒక న్యూస్‌ వచ్చింది. మళ్ళీ షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. కొన్ని వందల, వేల కథలు సినిమా రూపంలో ఆడియన్స్‌ ముందుకు వస్తాయి కాబట్టి కొత్త కథల్ని చూడాలనుకోవడంలో తప్పు లేదు. అలాంటి ఒక మంచి కథ కోసం వెదుకుతున్న సమయంలో తమిళంలో రిలీజై సూపర్‌హిట్‌ అయిన ‘కణ’ సినిమాని చూడటం జరిగింది. ఆ సినిమాని తెలుగులో చేద్దామనుకుంటున్న సమయంలో ఈ సినిమా తెలుగు రైట్స్‌ గురించి చాలామంది ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మనం తినే బియ్యపు గింజ మీద మన పేరు రాసుంటే ఎలా అయినా మన దగ్గరకి వస్తుంది అన్నట్లు ఒకరోజు కె.ఎస్‌. రామారావు గారు ఫోన్‌ చేసి, ‘కణ’ సినిమా రైట్స్‌ తీసుకున్నాను. మీరు ఒకసారి చూడండి, తెలుగులో సినిమా చేద్దాం అన్నారు. నేను అప్పటికే ఆ సినిమా చాలాసార్లు చూసి ఉన్నాను. తప్పకుండా ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. 50 సంవత్సరాలుగా 47 సినిమాలు ప్రొడ్యూస్‌ చేసి, అన్నీ క్రాఫ్ట్స్‌ పట్ల కమాండింగ్‌ ఉన్న క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఈ సినిమాని తెరకెక్కించడం నిజంగా నా అదృష్టం. అంతకు మించి ఈ సినిమా ఒక లైఫ్‌ చూస్తున్నట్లుంటుంది. ఆడియన్స్‌ ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ఇంటికొచ్చాక కూడా మనల్ని హంట్‌ చేస్తూ ఉంటే అది ఒక గొప్ప సినిమా అని అర్థం. అలాంటి మంచి స్టోరి, కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, క్రికెటర్‌ అవ్వాలనుకునే ఒక మహిళ తన ప్రయాణంలో ఎలాంటి హార్డిల్స్‌ ఫేస్‌ చేసి, ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ స్థాయికి ఎలా ఎదిగింది అనేది కథాంశం. ఒక తండ్రి, కూతుళ్ళ మధ్య జరిగే ఎమోషన్స్‌ ప్రతి ఒక్కర్నీ ఆట్టుకుంటాయి. ఇక రాజేంద్రప్రసాద్‌గారి గురించి చెప్పేదేముంది. క్యారెక్టర్‌కి తగ్గట్లుగా ఆయన మౌల్డ్‌ అవుతారు. ఐశ్వర్యా రాజేష్‌ తమిళ్‌, మలయాళ భాషల్లో 25 నుండి 30 సినిమాల్లో నటించి ఆమె పేరుంటే సినిమా ఆడే స్థాయికి ఎదిగింది. ఆమె ఇలాంటి మంచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎమోషన్‌ సీన్లలో ఏనాడు గ్లిజరిన్‌ ఉపయోగించని సెటిల్డ్‌ ఆర్టిస్ట్‌. ఈ సినిమా విడుదలయ్యాక ఆ అమ్మాయి పెర్‌ఫార్మెన్స్‌ గురించి మీరే రాస్తారు. కార్తీక్‌ రాజు, ఐశ్వర్యా రాజేష్‌ మధ్య ఒక మంచి సాంగ్‌ ఉంటుంది. ఆ సాంగ్‌ అద్భుతంగా వచ్చింది. అలాగే కె.ఎస్‌. రామారావుగారు మంచి కథ ఇవ్వడమే కాకుండా ఆండ్రూలాంటి అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌ని కూడా ఇచ్చారు. ఆయన కథకి తగ్గ బ్యూటిఫుల్‌ విజువల్స్‌ ఇచ్చారు” అన్నారు.

హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ – ”కౌసల్య కృష్ణమూర్తి’ నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. తమిళ్‌, మలయాళం, హిందీ సినిమాలు చేశాను. ఈ సినిమా తెలుగులో నా మొదటి చిత్రం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్స్‌ కె.ఎస్‌. రామారావుగారు, కె.ఎ. వల్లభ నిర్మాణంలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయడం హ్యాపీ. అలాగే కార్తీక్‌ రాజు, ఆండ్రూ అందరూ టెక్నీషియన్స్‌ కష్టపడి క్రికెట్‌ని బేస్‌ చేసుకొని ఒక మంచి కంటెంట్‌ మూవీతో మీ ముందుకు వస్తున్నాం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ మీ అందరికీ కచ్చితంగా నచ్చి ఉంటుంది. అది మాత్రమే కాదు.. ఆడియో, వీడియో సాంగ్స్‌, మూవీని త్వరలోనే మీరందరూ చూడబోతున్నారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ ది క్రికెటర్‌ని తప్పకుండా మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ, నటుడు కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All