Homeటాప్ స్టోరీస్తమన్నా అందం, అభినయం తో పోల్చుకుంటే ఆఫర్లు చాలా తక్కువ....

తమన్నా అందం, అభినయం తో పోల్చుకుంటే ఆఫర్లు చాలా తక్కువ….

tamannaah
tamannaah

మిల్కీ బ్యూటీ ‘తమన్నా భాటియా‘ టాలీవుడ్ ని వరించిన పాల అందం. అభినయం లో ముందు, అందాల ప్రదర్శనలో ముందు, కత్తి పట్టి పోరాట సన్నివేశాలలో కూడా ముందే. ఇక అన్ని ఉన్న తమన్నాకి మాత్రం ఆఫర్లు చాలా తక్కువగా వస్తున్నాయి అనుకుంటున్నా వారికి తమన్నా ఇచ్చే సమాధానం తన తదుపరి సినిమాలే.

ఈ సంవత్సరం అభినేత్రి-02 సినిమా ఒక్కటే రిలీజ్ చేసింది. ఎందుకంటే సైరా సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేయటం వాళ్ళ ఇంకొక సినిమాకి ఛాన్సెస్ తక్కువ వచ్చాయి. సైరా లో తన సీన్స్ అయిపోయాయో లేదో చకచకా సినిమాలు మొదలు పెట్టేసింది.

- Advertisement -

తెలుగులో ఒక్క సైరా, ఇంకా రిలీజ్ కానీ ‘దట్ ఇస్ మహాలక్ష్మి’ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ‘బోలె చుడియాన్’ , తమిళంలో ‘యాక్షన్’ , ‘పెట్రోమాక్స్’ సినిమాలు ఒక్కొక్కటి ఈ ఏడాది చివరి వరకు రిలీజ్ అవుతాయి. బోలె చుడియన్, యాక్షన్ సినిమాలోని మొదటి ట్రైలర్లు కూడా వచ్చేసాయి.

ఇక నిన్న రిలీజ్ అయిన ‘పెట్రోమాక్స్‘ ట్రైలర్ లో కూడా తమన్నా తన అభినయంతో బాగా నటించింది, నిజానికి అది మన తెలుగు సినిమా ‘ఆనందో బ్రహ్మ’ సినిమా తమిళ రీమేక్. కానీ రీమేక్ లా కాకూండా చాలా బాగా నటించింది అని ట్రైలర్ చూసి చెప్పెయ్య వచ్చు. ఇది వరకు తమన్నా అంటే నాభి, నడుము అందాలు చూపిస్తూ తన ఆఫర్లని అలా వలలో వేసేసుకునేది…అన్నవారే నేడు నిజంగా తమన్నా నటనని చూసి చాలా బాగా కష్టపడుతుంది అని అల్ ది బెస్ట్ చెపుతున్నారు.

ఒకప్పుడు తమన్నాని అందానికి వస్తున్న ఆఫర్లు అన్నవారే నేడు తన అందం, అభినయం ముందు తనకి ఇవన్నీ తక్కువ ఆఫర్లు అంటున్నారు. నిజంగా తమన్నా కి ఇది మంచి పరిణామం. తాను ఈ మాటని నిలబెట్టుకుంటుందా? లేక అందరి లాగ బాలీవుడ్, కోలీవుడ్ అంటూ సమయాన్ని వృధా చేస్తుందా చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All