Homeటాప్ స్టోరీస్నేపొటిజం ఉన్నమాట వాస్తవమే : త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌

నేపొటిజం ఉన్నమాట వాస్తవమే : త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌

నేపొటిజం ఉన్నమాట వాస్తవమే : త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌
నేపొటిజం ఉన్నమాట వాస్తవమే : త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌

ఇండ‌స్ట్రీలో నెపోటిజ‌మ్ వున్న మాట వాస్త‌వ‌మేన‌ని చాలా మంది హీరోల కొడుకులు, డైరెక్ట‌ర్‌ల కొడుకులు హీరోగా ట్రై చేశారు. కానీ ఫెయిల్ అయ్యారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వాళ్లు టాలెంట్ తో సూప‌ర్ స్టార్ లుగా ఎదిగారు. బేసిక్‌గా మ‌న టాలెంట్‌ని మ‌నం ప్ర‌ద‌ర్శించాలి. దానికి ప‌ట్టుద‌ల కావాలి. ఎంత సేపు వాళ్ల‌ని వీళ్ల‌ని తిట్ట‌కుండా సిన్సియ‌ర్‌గా తీసిన సినిమా `నెపోటిజ‌మ్‌` అన్నారు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.

వెంకీ, వాసిం, వెంక‌ట్ పొడిశెట్టి, జ‌గ‌దీష్ ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం `నెపోటిజ‌మ్‌`. విపుల్ ద‌ర్శ‌క‌త్వం వ‌మిస్తున్నారు. పాపిన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై కొర్ర‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో వై.అనిల్ కుమార్‌, కె. శ్రీ‌నివాస‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలోని లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేసిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ నెపోటిజ‌మ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

- Advertisement -

పుట్ట‌గానే ఎవ్వ‌రూ స్టార్ కారు స్టార్ అవ్వాలంటే ఎవ‌రైనా క‌ఠోరంగా శ్ర‌మించాల్సిందే. ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. కొత్త త‌రహా చిత్రాల్ని ఆద‌రించే ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రం త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది` అని విపుల్ తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All