
వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `అంధాధూన్`. టాబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో మూడు పురస్కారాల్ని దక్కించుకుని విమర్శలకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయాలని దర్శకనిర్మాతలు పోటీ పడ్డారు. రైట్స్ విషయంలో భారీ పోటీ నెలకొన్నా భారీ మొత్తాన్ని చెల్లించి హీరో నితిన్ సొంత నిర్మాణ సంస్థ రీమేక్ హక్కుల్ని దక్కించుకుంది.
నితిన్ హీరోగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రీమేక్ కానున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నభా నటేష్, టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే ఛాలెంజింగ్ పాత్రలో తమన్నా అంగీకరించడానికి యంగ్ హీరో నితిన్ భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ ఇచ్చారట. కోటిన్నర ఆఫర్ ఇవ్వడంతో మరో ఆలోచన లేకుండా తమన్నా ఈ ఆఫర్‌ని ఓకే చేసిందని తాజాగా వినిపిస్తోంది. అంటే కోటిన్నరకు మిల్కీవైట్ బ్యూటీ తమన్నా సరెండర్ అయ్యిందన్నమాట.