
మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్లో దూసుకుపోతుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటీకే ఈ పాటకు మహేష్ కూతురు సితార , కీర్తి సురేష్ లు స్టెప్స్ వేస్తూ ఆ వీడియో లు సోషల్ మీడియా లో షేర్ చేయగా..తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్..కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్స్ వేసాడు. ఈ వీడియో ను ట్విట్టర్ లో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇక ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబుని పరశురామ్ తనదైన శైలిలో కంపర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడని తెలుస్తుంది. సినిమాలో కమర్శియల్ అంశాలు పుష్కలంగా జొప్పించినట్లు కళావతి పాత్రను..మహేష్ క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ల్లో ఉంది. మహేష్ డబ్బింగ్ పనులు పూర్తిచేసి కొత్త సినిమా షూట్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.
#Siggggguthooooooooo !!!
Nannnnuu nennnneeaaaaaaa ????????? thanks to dear master @shekarmaster for joining me ▶️✨?My love to Our Very Own #Superstar @urstrulyMahesh Gaaru ? #SensationalKalaavathi #KalaavathiMusicVideo #KalaavathiChallenge #SVPFirstSingle ❤️ pic.twitter.com/jmC1LUlfth
— thaman S (@MusicThaman) February 22, 2022