
ఎస్ ఎస్ థమన్ కు తెలుగులో ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో చిత్రాలతో పాటు క్రేజ్ ఉన్న సినిమాలు అన్నీ కూడా థమన్ వద్దకే మొదటగా వెళుతున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా మ్యూజిక్ లో తన క్వాలిటీ మాత్రం ఎక్కడా తగ్గకుండా బెస్ట్ ఔట్పుట్ ఇస్తున్నాడు. అయితే తెలుగుతో పోల్చుకుంటే తమిళ్ లో థమన్ కు ఉన్న క్రేజ్ తక్కువే. అయితే అల వైకుంఠపురములో సంగీతం వేరే భాషల వారిని కూడా మెప్పించడంతో తమిళ్ లో కూడా థమన్ కు డిమాండ్ పెరుగుతోంది.
తమిళ్ స్టార్ హీరో విజయ్, వంశీ పైడిపల్లితో చేసే సినిమాకు థమన్ సంగీతం అందించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో మళ్ళీ తనకు తమిళ్ లో అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం థమన్ శివ కార్తికేయన్ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలున్నాయి. డాక్టర్ చిత్రంతో శివ కార్తికేయన్ అక్కడ స్టార్ హీరోగా టాప్ స్థాయికి చేరుకున్నాడు.
కెవి అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించవచ్చు. థమన్ పుట్టినరోజు సందర్భంగా శివ కార్తికేయన్ విషెస్ తెలుపుతూ బుట్ట బొమ్మ లాంటి పాటలు మరిన్ని అందివ్వాలని ఆకాంక్షించాడు. దానికి థమన్ రిప్లై ఇస్తూ, “అదరగొడదాం” అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేసాడు.
ఇవి కూడా చదవండి:
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా శివ కార్తికేయన్ డాక్టర్
బీస్ట్ మరో నలభై రోజుల్లో పూర్తి చేసేస్తాడట
మరో టాలెంటెడ్ కోలీవుడ్ హీరో కూడా తెలుగులోకి
హాలిడే ట్రిప్ నుండి వచ్చి షూటింగ్ లో జాయిన్ అయిన రకుల్