Homeటాప్ స్టోరీస్అలా బ్యాలెన్స్ చేయ‌డం క‌త్తిమీద సామే!

అలా బ్యాలెన్స్ చేయ‌డం క‌త్తిమీద సామే!

అలా బ్యాలెన్స్ చేయ‌డం క‌త్తిమీద సామే!
అలా బ్యాలెన్స్ చేయ‌డం క‌త్తిమీద సామే!

అల్లు అర్జున్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లై ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర విజ‌యంలో హీరో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, పాట‌ల ర‌చ‌యిత‌లు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, కాస‌ర్ల‌శ్యామ్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రిల పాత్ర ఒకెత్తు త‌మ‌న్ అందించిన సంగీతం ఒకెత్తు. అంత‌గా ఈ చిత్ర విజ‌యాన్ని త‌మ‌న్ సంగీతం ప్ర‌భావితం చేసింది.

ఇలాంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత త‌మ‌న్ సంగీతం అందిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న చిత్ర‌మిది. త‌మ‌న్ తొలిసారి ప‌వ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీంతో స‌హ‌జంగానే ఈ చిత్ర సంగీతంపై అంచ‌నాలు పెరిగిపోయాయి.  అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో `మ‌గువా మ‌గువా‌..` పాట ఆక‌ట్టుకుంది.  ఇటీవ‌ల ఓ ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని త‌మ‌న్ బ‌య‌ట‌పెట్టారు.

- Advertisement -

త‌మ‌న్ మాట్లాడుతూ `ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ సినిమా అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో వుంటాయో ఓ అభిమానిగా ఊహించ‌గ‌ల‌ను. ప‌వన్‌క‌ల్యాణ్ స్టార్‌డ‌మ్‌, బ‌ల‌మైన క‌థ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డంలో నా బాధ్య‌త మ‌రింత ప‌పెరిగింది. ప‌వ‌ర్‌స్టార్ ఇమేజ్‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా. అదే టైమ్‌లో క‌థ నుంచి బ‌య‌టికి వెళ్ల‌కుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఈ చిత్రానికి పాట‌లు, నేప‌థ్య సంగీతం అందించ‌డం క‌త్తిమీద సామే. అయినా దాన్ని అదిగ‌మించ‌డానికి నా వంతు ప్ర‌య‌త్నించాను` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All