
బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక ఇదిలా ఉంటె శనివారం సినిమా సక్సెస్ మీట్ ఏర్పటు చేసారు. ఈ ఈవెంట్ లో తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది చాక్లెట్ లాంటి సినిమా.. ఇందులో ఆవకాయ ఎలా ఉంటుంది.. ఇందులో ఫైట్స్ లేవని అంటున్నారు. సాహోలో ప్రేమ లేదని అన్నారు.. ఇది పూర్తి స్థాయి ప్రేమ కథ.. ప్రేమతో వచ్చి సినిమా చూడాలి.. ఆ ప్రేమ నచ్చుతుంది.. ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది. ఈ సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తున్నారు.. యూవీ వాళ్లు డబ్బులు కురిపించారు.. డైరెక్టర్ తన ఐడియాను, కెమెరామెన్ తన కెమెరాను, నేను మ్యూజిక్ ద్వారా ప్రేమను పంచాను అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. తన టీం, సింగర్స్ అంతా కూడా గత మూడు నెలల నుంచి ఈ సినిమా కోసం పని చేశాం. అందరూ ఏడుస్తూనే ఉన్నారు.. పేరెంట్స్‌ని కూడా పిలవమని అన్నాను.. వాళ్లంతా కూడా సినిమాను చూసి ఎంతో గొప్ప అనుభూతికి లోనయ్యారు అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. తమన్ మాటలు విన్న వారంతా కాస్త ఎక్కువగా చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.