
కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్బంగా `తలైవి` నిర్మాతలు ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ రోజు అన్ని భాషలలో విడుదల చేశారు. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 23 న తెరపైకి రాబోతున్న తరుణంలో విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ అంచనాలను మరింత పెంచుతోంది. ట్రైలర్ ఆసాంతం రోమాంచిత దృశ్యాలతో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది.
అరవింద్ స్వామి ఎంజిఆర్ పాత్ర పోషించగా, ప్రకాష్‌రాజ్ కరుణానిధిగా కనిపిస్తున్నారు. ట్రైలర్ లో `ఒక సినిమా నటితో మనకి రాజకీయం నేర్పించాలను కోవడం అనేది … ఇది మగవాళ్ల ప్రపంచం.. మగ వాళ్లే పాలించాలి. ఒక ఆడదాని చేతిలో పార్టీని పెట్టి వెనక నుంచోం. … ఆ జయనే వారు వారసురాలిగా చూస్తున్నారు…`ఈ ప్రజలకు ఏదైనా చేయాలి. ప్రజల్లోకి రా`… అంటూ జయని ఎంజీఆర్ ఆహ్వానించడం..అందుకు కరుణానిధి తిరస్కరించడం.. అతనితోనే జయ ఛాలెంజ్ చేయడం.. ఎంజిఆర్ మరణం తరువాత ఆమెను నిండు సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా చీర లాగి అవమానించడం
`మహాభారతంలో ద్రౌపదికి కూడా ఇదే జరిగింది. తన చీరను లాగీ..అవమాన పరచిన ఆ కౌరవుల కథ ముగించి జడను ముడేసుకుని శపథాన్ని నెరవేర్చుకుంది. ఆ మహాభారతీనికి ఇంకో పేరుంది జయ.. ఈ ఎన్నికల్లో డబ్బు బలంతో మాత్రమే గెలవగలమనుకున్న వాళ్లెవ్వరూ నాకక్కర్లేదు. ఇది పోరాటం..ప్రజల కోసం పోరాటం.. ప్రాణం పోయే వరకు పోరాడతా.. నన్ను అమ్మగా చూస్తే నా హృదయంలో మీకు చోటుంటుంది.. నన్ను కేవలం ఒక ఆడదానిగా చూస్తే…` అంటూ కంగన చెబుతున్న డైలాగ్‌లు రోమాంచితంగా వున్నాయి. ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.