Homeటాప్ స్టోరీస్`జెర్సీ` చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్‌!

`జెర్సీ` చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్‌!

`జెర్సీ` చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్‌!
`జెర్సీ` చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్‌!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం `జెర్సీ`. గెలిచి ఓడిన ఓ విజేత గాథగా తెర‌కెక్కిన‌న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. శ్రద్ధా శ్రీ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించారు. ఓ క్రికెట‌ర్ జీవిత క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని కూడా గెల్చుకుని సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది.

2019 ఏప్రిల్ 19న విడుద‌లైన ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది. సోమ‌వారం 67వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్ని కేంద్రం ప్ర‌క‌టించింది. ఢిల్లీలో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో అవార్డుల్ని ప్ర‌క‌టించారు. తెలుగు నుంచి జాతీయ ఉత్త‌మ చిత్రంగా నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `జెర్సీ` చిత్రం ఎంపికైంది. అంతే కాకుండా ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేసిన న‌వీన్ నూలికి కూడా ఉత్త‌మ ఎడిట‌ర్‌గా అవార్డు ద‌క్కింది.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర‌వింద్‌, అమ‌న్ గిల్‌, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. షాహీద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా న‌వంబ‌ర్ 5న రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All