Homeటాప్ స్టోరీస్మనకి రిలీజ్ ప్లానింగ్ ఎప్పటికొస్తుంది

మనకి రిలీజ్ ప్లానింగ్ ఎప్పటికొస్తుంది

మనకి రిలీజ్ ప్లానింగ్ ఎప్పటికొస్తుంది
మనకి రిలీజ్ ప్లానింగ్ ఎప్పటికొస్తుంది

సినిమా తీయడం అనేది మాములు వ్యవహారం కాదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. వాటిని తట్టుకుని, వచ్చిన అవరోధాలను దాటుకుని సినిమా తీయడమంటే యజ్ఞం చేసినట్లే. అయితే సినిమా తీయడం ఎలా ఉన్నా దాన్ని చెప్పిన టైంకు రిలీజ్ చేయడం అనేది కత్తి మీద సాము వ్యవహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక సినిమా ఆలస్యమవడం వల్ల వేరే సినిమాలు కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. దాంతో అంతా గందరగోళ వ్యవహారంలా తయారవుతుంది. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విషయంలో మాత్రం రిలీజ్ డేట్ పరంగా క్లారిటీ ఉండడం అత్యవసరం.

బాలీవుడ్ నే తీసుకుంటే అందులో పెద్ద సినిమాలు అన్నీ ముందే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాయి. వచ్చే దసరా, ఈద్, 2021 ఈద్ కు కూడా వచ్చే సినిమాలను ఇప్పుడే ప్రకటించేసారు అంటే అర్ధం చేసుకోవచ్చు వారు రిలీజ్ డేట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో. అదే మనమైతే డిసెంబర్ లో వచ్చే సినిమాల విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతికి సినిమాల రిలీజ్ డేట్ లు ప్రకటించినా ఏ రోజు ఏది వస్తుందో ఇప్పుడే గట్టిగా చెప్పలేని పరిస్థితి.

- Advertisement -

షూటింగ్ విషయంలో కూడా మనకి, బాలీవుడ్ వాళ్లకు బోలెడంత వ్యత్యాసం ఉంది. బాలీవుడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ కు రిలీజ్ కు మధ్య రెండు నెలల విరామమైనా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకే సినిమాను బాగా ప్రమోట్ చేయడానికి వాళ్ళకి టైం దొరుకుతుంది. అందుకే కంటెంట్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ప్రమోషన్స్ తో ఆకట్టుకోవడం వల్ల ఓపెనింగ్ బాగుండి సినిమా హిట్ అనిపించుకుంటుంది.

కానీ మన దగ్గర దీనికి పూర్తిగా భిన్నం. సినిమా రిలీజ్ ఒక వారంలో ఉందనగా కూడా షూట్ చేసిన రోజులున్నాయి. రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రానికైతే సినిమా విడుదలకు రెండు రోజుల ముందు సాంగ్ షూట్ చేసారు. దీని వల్ల ఒక్కోసారి అసలు సినిమాను ప్రమోట్ చేసుకోవడానికే సమయం చిక్కదు. ఇది సినిమా ఫలితంపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎన్ని ఉదాహరణలు చూసినా టాలీవుడ్ లో ఈ విషయంపై మార్పు రాకపోవడం నిజంగా శోచనీయం.

తెలుగు దర్శకులలో పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి లాంటి వారు దీనికి మినహాయింపు. సినిమా షూటింగ్ రోజునే వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పి ఆ రోజుకి సినిమాను రిలీజ్ చేయగలరు. ఇదే డిసిప్లీన్ అందరి దర్శకులలో ఉంటే రిలీజ్ డేట్ల విషయంలో కన్ఫ్యూజన్ ఉండదు. దానివల్ల మిగిలిన సినిమాలు కూడా ఎఫెక్ట్ అవ్వవు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All