Homeగాసిప్స్హైద‌రాబాద్‌లో టెస్టులు ఎందుకు ఆపేశారు?

హైద‌రాబాద్‌లో టెస్టులు ఎందుకు ఆపేశారు?

హైద‌రాబాద్‌లో టెస్టులు ఎందుకు ఆపేశారు?
హైద‌రాబాద్‌లో టెస్టులు ఎందుకు ఆపేశారు?

తెలంగాణ‌లో మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్‌లో క‌రోనా ఉదృతి కొన‌సాగుతోంది. టెస్టులు చేయాల‌ని, టెస్టుల వ‌ల్లే క‌రోనాని అదుపు చేయవ‌చ్చ‌ని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌లు మార్లు మంద‌లించింది. అయినా ప్ర‌భుత్వం టెస్టులు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. మ‌రోసారి హైకోర్టు ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించ‌డంతో జీహెచ్ ఎంసీ ప‌రిధిలో 50 వేల టెస్టులు చేస్తామంటూ ప్ర‌క‌టించి టెస్టులు చేయ‌డం మొద‌లుపెట్టింది. రోజు రోజుకీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిథిలోనే 600 వంద‌ల‌కు మించి పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం, టెస్టులు ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ‌లో పాజిటివ్ కేసుల సంఖ్య ప‌ది వేలు దాటడం క‌ల‌క‌లం రేపుతోంది.

దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైన రాష్ట్ర ఆరోగ్య శాఖ‌, రాష్ట్ర ప్ర‌భుత్వం టెస్టుల‌ని తాత్కాలికంగా ఆపేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. హైకోర్టు మంద‌లింపుతో జీహెచ్ ఎంసీ ప‌రిధిలో 50 వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం తాజాగా టెస్టుల‌ని నిలిపివేయ‌డంతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్ప‌టికే సేక‌రించిన టెస్టింగ్ శాంపిల్స్‌కు టెస్టింగ్ ప్ర‌క్రియ పూర్తి కాక‌పోవ‌డంతో రెండు రోజుల పాటు జీహెచ్ ఎంసీ ప‌రిథిలో టెస్టుల‌ని అధికారులు నిలిపివేసిన‌ట్టు తెలిసింది. ఆ టెస్టుల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత తిరిగి మ‌ళ్లీ టెస్టులు మొద‌లుపెడ‌తార‌ట‌.

- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన టెస్టుల‌తో బుధ‌వారం నాటికి తెలంగాణ‌లో క‌రోనా సోకిన వారి సంఖ్య 10 వేలు దాటింది. బుధ‌వారం ఒక్క‌రోజే 891 మందికి క‌రోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ అయ్యింది. అందులో జీహెచ్ ఎంసీ ప‌రిథిలో 719 మందికి క‌రోనా సోకిన‌ట్టు తేలింది. మిగ‌తా కేసులు రంగారెడ్డిలో 86, మేడ్చ‌ల్‌లో 55 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో తెలంగాణ‌లో మొత్తం క‌రోనా సోకిన వారి సంఖ్య 10,444కు చేరింది. ఇందులో 4,361 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All